ఎనర్జిటిక్ స్టార్ రామ్
హీరోగా సంతోష్ శ్రీనివాస్
దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న
చిత్రం ‘హైపర్ (ప్రతి ఇంట్లో
ఒకడుంటాడు)’. ఈ చిత్రంలోని ‘కమ్‌బ్యాక్..’
అనే పాటను ఇటీవల విడుదల చేసిన
చిత్ర బృందం ఇవాళ మరో రెండు
పాటల టీజర్లను విడుదల చేసింది.
14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్
పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్
ఆచంట, అనీల్ సుంకర ఈ చిత్రాన్ని
నిర్మిస్తున్నారు. జిబ్రాన్
సంగీతం సమకూర్చారు. సత్యరాజ్,
రావు రమేష్, మురళీశర్మ, పోసాని
కృష్ణమురళి, ప్రభాస్ శ్రీను,
తులసి, హేమ తదితరులు ఈ చిత్రంలో
నటించారు. సెప్టెంబరు 30న విజయదశమి
కానుకగా ‘హైపర్’ను ప్రపంచ
వ్యాప్తంగా విడుదల చేయడానికి
సన్నాహాలు చేస్తున్నారు.

No comments:
Post a Comment