‘బాహుబలి’తో భారత
చిత్ర పరిశ్రమ మొత్తాన్నీ తనవైపు తిప్పుకున్నాడు దర్శక ధీరుడు రాజమౌళి.
ఇప్పుడు ఆ చిత్రానికి కొనసాగింపుగా వస్తున్న ‘బాహుబలి: ది కంక్లూజన్’ కోసం
మొత్తం చిత్ర పరిశ్రమ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ సినిమా ఇంకెంత
అద్భుతంగా ఉండబోతోందో అంటూ ఎవరికి వారు ఊహించేసుకుంటున్నారు.
అందుకు
తగ్గట్టుగానే రెండో భాగంపై మరింత దృష్టిపెట్టాడట రాజమౌళి. ఈ భాగంలో రెండు
అదిరపోయే యుద్ధ సన్నివేశాలు ఉండబోతున్నాయట. విశేషమేమిటంటే ఆ రెండింట్లోనూ
కీలకపాత్ర పోషించేది హీరోయిన్ అనుష్కేనట. ఒక యుద్ధం ప్రభాస్-అనుష్క మధ్య,
మరో యుద్ధం రానా-అనుష్క నడుమ ఉంటుందట. ఈ రెండు సన్నివేశాలూ సినిమాకు చాలా
కీలకమట. ముఖ్యంగా రానా-అనుష్క మధ్య వచ్చే యుద్ధ సన్నివేశాలు చాలా అద్భుతంగా
ఉంటాయట. ‘బాహుబలి’ మొదటి భాగంలో పెద్దగా ప్రాధాన్యం దక్కకపోయినా.. రెండో
భాగంలో మాత్రం ఆ లోటు తీరుస్తుందట స్వీటీ. ఇటీవల అనుష్క బాగా లావైపోవడంతో
‘బాహుబలి’ రెండో భాగంలో కూడా ఆమె పాత్ర ప్రాధాన్యాన్ని
తగ్గించేస్తున్నారన్న గుసగుసలు వినబడుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ
వార్తలు మాత్రం అనుష్క పాత్ర ‘నభూతో..’ అన్న రీతిలో ఉండబోతోందని
ఊరిస్తున్నాయి. నిజమేంటనేది సినిమా విడుదలైతే కానీ తెలియదు.
No comments:
Post a Comment