అగర్తలా:
పారాలింపిక్స్ టీ-42 హైజంప్‌లో
స్వర్ణ, కాంస్య పతక విజేతలు
మరియప్పన్ తంగవేలు, వరుణ్‌సింగ్
భాటికి భారత మేటి జిమ్నాస్ట్
దీపా కర్మాకర్ అభినందనలు తెలియజేసింది.
రియో ఒలింపిక్స్ ఆర్టిస్టిక్స్
జిమ్నాస్టిక్స్‌లో దీప త్రుటిలో
పతకం కోల్పోయినా అందరి మనసుల్నీ
గెలిచింది. వాల్ట్ విభాగంలో
ప్రపంచ అగ్రశ్రేణి జిమ్నాస్ట్‌లు
సైతం చేసేందుకు సాహసించని ప్రొడునోవా
విన్యాసంతో ఆమె అందర్నీ ఆకట్టుకున్న
సంగతి తెలిసిందే.
‘నేను కోల్పోయిన దాన్ని మీరు సాధించారు. వ్యక్తిగతంగా మీ ఇద్దర్నీ కలవాలని కోరుకుంటున్నట్లు’ అభినందనల సందేశంలో దీప తెలిపింది. ‘భారతీయుడిని అయినందుకు గర్విస్తున్నాం. మీరు (మరియప్పన్, భాటి) అందర్నీ గర్వపడేలా చేశారని’ దీప కోచ్ బిశ్వేశ్వర్ నంది అన్నారు.

No comments:
Post a Comment