ఇంటర్‌నెట్ వచ్చిన తరువాత
నచ్చిన సినిమాలు చూడటం తేలిక అయిపోయింది. ఒకపుడు సినిమా చూడాలంటే
థియటర్‌కు వెళ్లాల్సి వచ్చేది. కేబుల్ టీవీ వచ్చిన తరువాత సినిమా
నట్టింట్లోకి వచ్చేసింది. ఇంటర్‌నెట్ విస్తరించిన తరువాత కొత్త సినిమాలను
కూడా నెట్‌లో చూసే వెసులుబాటు వచ్చేసింది. అదే ఫాస్ట్ ఫిల్మ్జ్. ఈ యాప్
రీజనల్ సినిమాలకు ఉద్దేశించినది. రూ.10 చెల్లిస్తే చాలు అన్‌లిమిటెడ్‌గా
సినిమాలు చూడొచ్చు. ఈ యాప్‌లో ప్రత్యేక లైబ్రరీ కూడా ఉంటుంది. అయితే
ప్రస్తుతానికి 150 తమిళ సినిమాలను పొందుపరిచారు. ఈ యాప్‌లో తెలుగు
సినిమాలను కూడా పెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. నెలవారీ
సబ్‌స్ర్కిప్షన్ తీసుకోవాల్సినపని లేదు. రోజుకు రూపాయి లెక్కన పది రోజులకు
పది రూపాయలు చెల్లిస్తేచాలు. ఈ యాప్ కేవలం సినిమాను చూడటమే కాదు,
డౌన్‌లోడ్ చేసుకునే వెసులుబాటు కూడా కల్పిస్తుంది. ఈ యాప్‌లో ఆరు విభాగాలు
ఉంటాయి. స్టార్లు, సీన్స్, న్యూ ఎరైవల్స్, షో కేస్, ఎక్స్‌ప్లోర్
మరియు మై డౌన్‌లోడ్స్ అని ఉంటాయి.

No comments:
Post a Comment