Monday, 16 May 2016

చిరంజీవితో జగపతి ఢీ..?

చిరంజీవి రీ ఎంట్రీ సినిమా ఇటీవల కొబ్బరికాయ కొట్టి ఆరంభించిన సంగతి తెలిసిందే. ఇక్కడ పూజ కాబట్టి కొబ్బరి కాయతో సరిపెట్టారు. సినిమాల్లో అయితే తలకాయలు పగలాల్సిందే. ఎందుకంటే మాస్ సినిమాలో ఫైట్స్ ఆ స్థాయిలో ఉంటాయి మరి. అందులోను ఇక్కడ ఉన్నది చిరంజీవి.. వి.వి.వినాయక్. మరి వీరిద్దరి శైలికీ సరపడా ఓ విలన్ ఉండాలి కదా. ఇప్పుడా పనుల్లోని తలమునకలై ఉన్నారు వినాయక్ అండ్ కో. విశ్వసనీయ సమాచారం ప్రకారం చిరు-వినాయక్ కలయికలో తెరకెక్కనున్న ‘కత్తిలాంటోడు’ సినిమాలో జగపతి బాబు, చిరుని ఢీ కొట్టనున్నారట. సీనియర్ హీరో బాలయ్యతో పాటు యంగ్ హీరోల సినిమాల్లోని ఆయా పాత్రలని తనదైశ శైలిలో పండిస్తూ సెకెండ్స్‌ ఇన్నింగ్స్‌లో దూసుకుపోతున్న జగపతి, చిరు రీ ఎంట్రీ సినిమాలో విలన్‌గా దాదాపు ఖాయమని తెలుస్తోంది. ఈ సినిమాకి మాతృక అయిన మురుగదాస్ తెరకెక్కించిన ‘కత్తి’లో తోత రాయ్ చౌదరి నటించిన పాత్రలో జగపతి కనపడనున్నారు. తొలుత ఈ పాత్రకి వేరేవాళ్ళని అనుకున్నా ఈ పాత్రకు జగపతి అయితేనే కరెక్టని చిత్ర బృందం ఫిక్సయ్యారట. పేరుకి జగపతి విలన్‌గా నటిస్తున్నా స్టైల్ పరంగా హీరోలను మించిపోతున్నారు. అందుకని ఈ విషయంలో చిరు మరింత జాగ్రత్త తీసుకోవాలిప్పుడు. సినిమా తెరమీదికొచ్చేలోపు చిరు-జగపతి ఫైట్స్ ఏ రేంజ్‌లో ఉండాలన్నది ప్రస్తుతానికి మీవైన విజువల్స్‌ ద్వారా చూసుకోండి.

No comments:

Post a Comment