Thursday, 12 May 2016

నాలుగోతరం మోటో జీ వస్తోంది..!

  ప్రముఖ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల సంస్థ మోటరోలా వచ్చే వారంలో మోటో జీ(నాలుగో తరం) ఫోన్‌ని మార్కెట్లోకి విడుదల చేయనుంది. భారత్‌లో మంగళవారం విడుదలకానున్న ఈ ఫోన్‌ అమెజాన్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా కొనుగోళ్లకు అందుబాటులోకి రానుంది.
ఇదే విషయాన్ని మోటరోలా మొబిలిటీ ఇండియా హెడ్‌ అమిత్‌ బోనీ సైతం ఓ పత్రికా ప్రకటన ద్వారా వెల్లడించారు. భారత్‌లో ఈ కామర్స్‌ వేగంగా వృద్ధి చెందుతున్న నేపథ్యంలో తాము దాని ద్వారానే భారత్‌లో అమ్మకాలు జరపాలనుకుంటున్నట్లు చెప్పారు. భారత్‌లో అమెజాన్‌.ఇన్‌ మంచి ఆన్‌లైన్‌ అంగడి అని అందుకే దాని ద్వారానే అమ్మకాలు సాగించాలనుకుంటున్నామని చెప్పారు.
అంతర్జాలంలో లీకైన వివరాల ప్రకారం... ఈ ఫోన్‌ ఫీచర్ల వివరాలు ఇలా ఉన్నాయి.
* 5.5 అంగుళాల తాకే తెర
* 1080×1920 పిక్సల్స్‌ రిజల్యూషన్‌
* ఆక్టాకోర్‌ ప్రాసెసర్‌
* 2జీబీ ర్యామ్‌
* 16 జీబీ అంతర్గత మెమొరీ
* 13 మెగాపిక్సల్‌ రేర్‌ కెమేరా
* 2470 ఎంఏహెచ్‌ బ్యాటరీ

No comments:

Post a Comment