Sunday, 29 May 2016

కాసేపట్లో టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు

    మరికాసేపట్లో టీడీపీ పొలిట్ బ్యూర్ సమావేశం కానుంది. సమావేశంలో రాజ్యసభ అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉందని సమాచారం. కాగా రాజ్యసభ అభ్యర్థులుగా ఎవరి పేర్లు కేటాయిస్తారో అని ప్రజలంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
 
తెలుగు దేశం కోటాలో ఉన్న మూడు రాజ్యసభ సీట్లలో  ఒకటి బీజేపీకి ఇవ్వడానికి దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. నిన్న సాయంత్రం కేంద్రమంత్రి సుజనా చౌదరి..అరుణ్ జైట్లీతో సమావేశమై బీజేపీకి ఒక్కసీటు వదిలేందుకు సిద్ధమని చెప్పారు. ఒక్క రాజ్యసభ సీటు ఇచ్చినందుకు గాను తెలుగు దేశం నేతలకు జాతీయ స్థాయిలో నామినేటెడ్ సదవులు ఇవ్వాలని సుజనా..జైట్లీని కోరినట్లు సమాచారం
 
ఇక టీడీపీ రాజ్యసభ స్థానాల విషయానికొస్తే..ఉన్న రెండింట్లో ఒక్కటి దాదాపు సుజనా చౌదరికి ఖరారైందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సుజనాను ఆంధ్రా ప్రాంత కోటా నుంచి అవకాశం కల్పిస్తారని సమాచారం. ఇక రెండో స్థానాన్ని రాయలసీమ ప్రాంతానికి చెందిన బీసీ, సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ఇచ్చే అవకాశం ఉంది..వారిలో ముఖ్యంగా కర్నూల్ జిల్లాకు చెందిన బీటీ రాయుడు, చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే హేమలత రేసులో ఉన్నారని విశ్వసనీయ సమాచారం.

No comments:

Post a Comment