Friday, 13 May 2016

తెలంగాణలో బంగారుతల్లి పథకం రద్దు.. ఉత్తర్వులు జారీ

    తెలంగాణలో బంగారుతల్లి పథకాన్ని రద్దు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఆరోగ్యలక్ష్మి వంటి పథకాల కింద ఆడపిల్లల కోసం ఇప్పటికే కోట్లు ఖర్చు చేస్తున్నామని ప్రభుత్వం తెలిపింది. కాబట్టి బంగారు తల్లి పథకం అవసరం లేదని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు బంగారుతల్లి పథకాన్ని రద్దు చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులను పంపింది.

No comments:

Post a Comment