ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ నిలిచిపోయే అవకాశం ?
ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌కు
వరుణ గండం తప్పేలా లేదు. బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్‌కు, హైదరాబాద్
సన్‌రైజర్స్‌కు మధ్య ఆదివారం రాత్రి 8 గంటలకు మ్యాచ్ జరగనుంది. బెంగళూరు
చినస్వామి వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌పై వరుణుడి ఎఫెక్ట్ పడే అవకాశాలు
కనిపిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా బెంగళూరులోని పలు ప్రాంతాల్లో వర్షాలు
పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం బెంగళూరు వాతావరణం ఒక్కసారిగా
చల్లబడింది. వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ నిపుణులు
హెచ్చరిస్తున్నారు. అయితే ఒకవేళ వర్షం పడితే మ్యాచ్ గంట ఆలస్యంగా మొదలయ్యే
అవకాశమున్నట్లు తెలుస్తోంది. వర్షం తీవ్రత తగ్గకుంటే మ్యాచ్‌ను వాయిదా
వేయనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే... వర్షం పడకుండా మ్యాచ్ సజావుగా జరగాలని
ఐపీఎల్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
No comments:
Post a Comment