చివరి
వరకూ పోరాడి గెలిచిన సన్‌రైజర్స్
క్రిస్‌గేల్ విధ్వంసక ఇన్నింగ్స్ వృథా..
ఒత్తిడిలో తేలిపోయిన బెంగళూరు
క్రిస్‌గేల్ విధ్వంసక ఇన్నింగ్స్ వృథా..
ఒత్తిడిలో తేలిపోయిన బెంగళూరు
ఐపిఎల్
2016 విజేతగా సన్‌రైజర్స్ హైదరాబాద్ అవతరించింది. 8 పరుగుల తేడాతో
బెంగుళూరు జట్టును ఓడించింది. 209 పరుగుల టార్గెట్‌ను ఛేదించకుండా
బెంగుళూరు జట్టును కట్టడి చేసింది. 6 బంతుల్లో 18 పరుగులు చేయాల్సి ఉండగా
ఆఖరి ఓవర్ వేశాడు భువనేశ్వర్. కెప్టెన్ వార్నర్ భూవీతో పలుమార్లు మంతనాలు
జరిపాడు. అద్భుతంగా బౌలింగ్ చేసిన భువనేశ్వర్ బెంగుళూరు టెయిలెండర్స్‌ను
కట్టడి చేయగలిగాడు. 20వ ఓవర్ మూడో బంతికి భూవీ వేసిన చక్కని బంతిని కీపర్
అందుకుని రనౌట్ చేశాడు. ఆ సమయానికి 3 బంతుల్లో 15 పరుగులు చేయాల్సిన
పరిస్థితి ఉంది. దీంతో ఒత్తిడిలో ఉన్న బెంగళూరు ఆటగాళ్లు చేతెలెత్తేశారు.
ఐపిఎల్ చరిత్రలో మొదటిసారిగా కప్‌ను అందుకుంది సన్‌రైజర్స్ టీం.
జట్టు స్కోర్లు : సన్‌రైజర్స్ హైదరాబాద్ 208/7(20 ఓవర్లలో), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 200/7 (20 ఓవర్లలో)
హైదరాబాద్ బ్యాటింగ్ : వార్నర్ 69, బెన్ కటింగ్ 39, యువరాజ్ 38, ధావన్ 28
బెంగళూరు బ్యాటింగ్ : గేల్ 76, కోహ్లీ 54, డెవిలియర్స్ 5, వాట్సన్ 11, సచిన్ బాబీ 18.

No comments:
Post a Comment