Sunday, 29 May 2016

నేచురల్ కాల్ కోసం టాయ్‌లెట్‌కు వెళ్లాడు... లోపల కనిపించిన దాన్ని చూసి...

    బ్యాంకాక్: నేచురల్ కాల్ కోసం టాయ్‌లెట్‌కు వెళ్లిన వ్యక్తి బాత్రూమ్‌లో కనిపించిన దాన్ని చూసి కంగు తిన్నాడు. బ్యాంకాక్‌లోని ఛాకొన్గ్‌సయో ప్రావిన్స్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. బాత్రూమ్‌కని టాయ్‌లెట్‌కు వెళ్లిన బూన్‌కు టాయ్‌లెట్ పైప్‌లో 10 అడుగుల పైతాన్ కనిపించింది. దీంతో వెంటనే బాత్రూమ్ నుంచి బయటికొచ్చాడు. ఇరుగుపొరుగు వారు... భార్య సహాయంతో దాన్ని ఎట్టకేలకు చంపేసి బయటకు తీశాడు. అయితే ఈ క్రమంలో ఆ పాము బూన్‌ను కాటేసింది. ప్రస్తుతం బూన్ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.

No comments:

Post a Comment