సూర్యుడు అదే పనిగా కిరణాల కొరడాలతో కొడుతున్నట్లుంది ఈ ఎండాకాలం. ఇలాంటి భగభగలాడే సమ్మర్‌లో గ్లాసెడు కొబ్బరిబోండాం నీళ్లు తాగితే ఆ మజానే వేరు. మనసూ నిమ్మళిస్తుంది..పైగా ఒంట్లోని వేడిని తగ్గిస్తుంది. మరి ఇలాంటి కొబ్బరినీళ్లతో ఇంట్లోనే సులువుగా తయారు చేసుకునే డ్రింక్స్ ఏంటో తెల్సుకుందాం.
కావాల్సినవి
కొబ్బరినీళ్లు - ఒకటిన్నర కప్పు
తరిగిన బొప్పాయి ముక్కలు- కప్పు
పచ్చి కొబ్బరి- కప్పు
తయారీ విధానం
మొదట కొబ్బరినీళ్లు, బొప్పాయి ముక్కల్ని ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. ఫ్రిజ్‌లోంచి తీసిన ఈ కొబ్బరినీళ్లు, బొప్పాయి ముక్కలతో పాటు పచ్చి కొబ్బరి వేసి బ్లెండర్‌లో వేసి మెత్తగా వచ్చే వరకూ బ్లెండ్ చేయాలి. వెంటనే గ్లాసులో వేసుకుని పపాయ కోకనట్ డ్రింక్‌ను తాగేయాలి.
No comments:
Post a Comment