డీజిల్ కార్ల తయారీదారులకు
భారత్‌లో మరో ఎదురు దెబ్బ తగిలేలా
కనిపిస్తోంది. కాలుష్యం అధికంగా
ఉన్న మరో 11 నగరాల్లోనూ డీజిల్
కార్ల అమ్మకాలపై నిషేధం విధించాలని
నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్(ఎన్‌జీటీ)
యోచిస్తోందని నివేదికలు చెబుతున్నాయి.
ముంబయి, కోల్‌కతా, బెంగళూరు,
చెన్నై, హైదరాబాద్ తదితర నగరాల్లో
డీజిల్ కార్ల అమ్మకాలపై నిషేధం
పడే అవకాశం ఉందని విశ్వసనీయ
వర్గాల సమాచారం.
అయితే ఇప్పుడు కార్ల తయారీ సంస్థలు డీజిల్ కార్ల తయారీపై భారీగా పెట్టుబడులు పెట్టాయని ఇలా భారీ ఎత్తున వాటిపై నిషేధం విధిస్తూ పోతే ఉద్యోగాల కోత తప్పకపోవచ్చని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల మొదట్లో ఎన్‌జీటీ కేరళలో డీజిల్ వాహనాల రిజిస్ట్రేషన్లను నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. 2000సీసీ ఇంజన్ కెపాసిటీ గల వాహనాల రిజిస్ట్రేషన్లు నిలిపేయాలని కోరింది. ప్రజా రవాణాకు ఉపయోగించే వాహనాలను మాత్రం మినహాయించాలని చెప్పింది. దిల్లీలో ఇప్పటికే ఈ వాహనాలపై నిషేధం అమలులో ఉన్న సంగతి తెలిసిందే.

No comments:
Post a Comment