Monday, 30 May 2016

వీడు చిన్నోడు కాదు.. పెద్దోడు

ఈ బాలుడు.. ఏడాదికే మగాడయ్యాడు

న్యూఢిల్లీ: పుట్టి ఏడాదైనా కాని బాలుడు పూర్తి మగాడుగా మారాడు. ఆ వయసు పిల్లలకంటే 15 సెంటీమీటర్ల ఎత్తు ఎక్కువగా పెరిగాడు. ముఖంపై గడ్డం , మీసంతో పాటు మర్మాంగాల పెరుగుదలలో తేడా కనిపించింది. ఢిల్లీకి చెందిన పేరెంట్స్  మరో ఆరు నెలలకు దీన్ని గమనించలేకపోయారు. బిడ్డ అసహజ ఎదుగుదలపై ఆందోళన చెందారు. వెంటనే వైద్యులను సంప్రదించడంతో తల్లిదండ్రులకు అసలు విషయం తెలిసింది.
 
తమ కుమారుడు ఏడాది వయసులోనే పూర్తి యుక్త వయసు లక్షణాలు కలిగి ఉన్నట్లు వైద్య  పరీక్షల్లో నిర్థారణ అయ్యింది. ఏడాది వయసు బాలుడికి 25 ఏళ్ళ వ్యక్తి మాదిరిగా టెస్టోస్టెరాన్ లెవల్స్ ఉండటం ఆశ్చర్యం కలిగించింది. అంత చిన్న వయసులో పాతికేళ్ళ వయసు లక్షణాలను ఆ బాలుడు తట్టుకోలేకపోతున్నాడు. లక్ష మందిలో ఒకరికి ఇలా జరుగుతుందని డాక్టర్లు చెబుతున్నారు. టెస్టోస్టెరాన్ లెవల్స్ నియంత్రించేందుకు ప్రతి నెలా హార్మన్ ఇంజక్షన్స్ చేయాలని ఆ బాలుడి తల్లిదండ్రులకు వైద్యులు సూచించారు.

No comments:

Post a Comment