Monday, 16 May 2016

రెండు నిమిషాల జాప్యం.. ఏడాది మూల్యం!

హైదరాబాద్‌ పాతబస్తీకి చెందిన లక్ష్మి, రాధికలు అక్కాచెల్లెళ్లు.. వీరిద్దరూ ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ అభ్యర్థులు కూడా.. ఆదివారం ఉదయం పది గంటలకు ప్రవేశ పరీక్ష రాసేందుకు ఇంటి నుంచి ఆటోలో బయలుదేరారు. తొలుత తన సోదరిని దోమల గూడలోని ఏవీ కళాశాల వద్ద దింపిన లక్ష్మి.. అనంతరం తన పరీక్ష కేంద్రమైన బషీర్‌బాగ్‌లోని నిజాం కళాశాల వద్దకు చేరుకుంది. అప్పటికి సమయం పది గంటల రెండు నిమిషాలైంది. కళాశాల సిబ్బంది లక్ష్మిని పరీక్ష కేంద్రం లోపలికి అనుమతించలేదు. ఆ సమయంలో అక్కడే ఉన్న డీసీపీ కమలాసన్‌రెడ్డిని కలిసి పరిస్థితిని వివరించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో నిజాం కళాశాల ప్రవేశ ద్వారం వద్ద ఆ విద్యార్థిని ఇలా కన్నీరు మున్నీరైంది.

No comments:

Post a Comment