Friday, 13 May 2016

బ్రిటన్ పార్లమెంట్‌లో మోహన్‌బాబు ‘డైలాగ్‌ బుక్‌’

నాలుగు దశాబ్దాల నట జీవితం పూర్తి చేసుకొన్న మోహన్‌బాబుకు అరుదైన గౌరవం దక్కింది. మోహన్ బాబు నటించిన వివిధ చిత్రాల్లోని పాపులర్ డైలాగ్స్ అన్నీ ‘డైలాగ్ బుక్’లో ప్రచురించి బుధవారం బ్రిటన్ పార్లమెంట్‌లో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బ్రిటన్ పార్లమెంట్‌ సభ్యులు బాబ్‌ బ్లాక్‌మన్, వీరేంద్రశర్మ, మోహన్ బాబు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అక్కడి సభ్యులనుద్దేశించి లక్ష్మీ మంచు ప్రసంగించగా, మంచు మనోజ్‌ తండ్రిని అనుకరిస్తూ హావభావాలు, డైలాగులతో అలరించారు. మంచు విష్ణు కోరడంతో చివరగా ‘పెదరాయుడు’ చిత్రంలోని పాపులర్‌ డైలాగ్స్‌ చెప్పి అందర్నీ ఆకట్టుకున్నారు మోహన్ బాబు. ‘డైలాగ్‌ బుక్‌’కు హీరో నందమూరి బాలకృష్ణ ముందుమాట రాయడం గమనార్హం. కాగా మోహన్ బాబు నాలుగు దశాబ్దాల నట ప్రస్థానాన్ని పురస్కరించుకొని సెప్టెంబర్‌లో విశాఖపట్నంలో భారీ వేడుకను నిర్వహించనున్నట్లు విష్ణు తెలిపారు.

No comments:

Post a Comment