Sunday, 22 May 2016

ఐపిఎల్‌లో ధోని సరికొత్త రికార్డు...

ఇప్పటివరకూ లేని రికార్డు నమోదు చేసిన ధోని
   ఐపిఎల్ హిస్టరీలో ధోని సరికొత్త రికార్డు సృష్టించాడు. ఛేజింగ్ చేస్తున్నప్పుడు ఆఖరి ఓవర్‌కు చేయాల్సిన పరుగుల విషయంలో ఈ రికార్డు నమోదయ్యింది. ఒత్తిడిలో ఉన్న సమయంలో లాస్ట్ ఓవర్‌కు అత్యధిక పరుగులు రాబట్టాలంటే చాలా కష్టం. అలాంటిది ఇవాళ వైజాగ్‌లో పూణె, పంజాబ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ధోని చివరి 6 బంతుల్లో 22 పరుగులు చేసి మ్యాచ్‌ను గెలిపించాడు. పంజాబ్ బౌలర్ అక్సర్ బౌలింగ్‌లో మూడు సిక్స్‌లు ఒక ఫోర్ బాదాడు. చివరి మూడు బంతుల్లో 16 పరుగులు చేయాల్సి ఉండగా ఒక ఫోర్, రెండు సిక్స్‌లు, ఒక వైడ్ కలుపుకుని మొత్తం 23 పరుగులు రావడంతో తన జట్టుకు విజయాన్ని అందించాడు. అంతకుముందు ఈ రికార్డు 21 పరుగుల వద్ద ఉండేది. ఈ విధంగా లాస్ట్ ఓవర్‌లో మూడు సార్లు 21 పరుగులు చేయడం జరిగింది. అయితే ధోని 23 రన్స్ రాబట్టుకుని కొత్త రికార్డు నమోదు చేసాడు.

No comments:

Post a Comment