Tuesday, 17 May 2016

చీకట్లో 42 గంటలు

  • పద్మారావునగర్‌లో నిలిచినవిద్యుత్ సరఫరా 
  • విరిగిన 50 స్తంభాలు, 4 ట్రాన్స్‌ఫార్మర్లు 
  • 15 బృందాలతో మరమ్మతు పనులు 
  • నాసిరకం స్తంభాలతో ప్రమాదమంటున్న స్థానికులు 
  • విద్యుత్ సరఫరా పూర్తిస్థాయిలో మెరుగు : ఎస్‌ఈ 

   నగరంలో రెండురోజుల క్రితం వీచిన గాలి వాన బీభత్సం పలుప్రాంతాలను 42 గంట ల పాటు చీకటిలో ఉంచింది. సికింద్రాబా ద్‌ పద్మారావునగర్‌, వెంకటాపురంకాలనీ, అభినవనగర్‌కాలనీ, కందిగిరి ఆలయం పరిసరాలు, శ్రీనివాసనగర్‌కాలనీ, బలరాం కాలనీల్లో 42 గంటలపాటు విద్యుతసరఫ రా పూర్తిగా నిలిచిపోయింది. శనివారం రాత్రి 10 గంటల ప్రాంతంలో గాలివానకు చెట్లుకూలి 50 విద్యుత స్తంభాలు, 4 ట్రా న్స్‌ఫార్మర్లు విరిగిపడటంతో పాటు విద్యుత తీగలు పూర్తిగా తెగిపోయాయి. దీంతో రెండు రోజులుగా కరెంట్‌ లేక ఫోన్‌చార్జిం గ్‌కు కూడా ఇతర ప్రాంతాల్లోని బంధువుల ఇళ్లకు వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని పద్మారావునగర్‌ వాసులు తెలిపారు. సోమవారం సాయం త్రం 5 గంటల వరకు సెంట్రల్‌జోన్‌ అధికారులు 15 సీబీడీ బృందాలు, 4 క్రేన్ల సహకారంతో 20 మంది సీనియర్‌ ఇంజనీరింగ్‌ అధికారులతో కలిసి విద్యుత మరమ్మతు పనులు నిర్వహించారు. 50 స్తంభాలు పూర్తిగా విరిగిపోవడంతో వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేసి విద్యుత సరఫరాను పునరుద్ధరించారు. చెట్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మళ్లీ విద్యుత తీగలు తెగిపడకుండా బంచు డ్‌కేబుల్స్‌ వేశారు. గాలివానతో గ్రేటర్‌లో విద్యుత సంస్థకు రూ.కోటి వరకు నష్టం వచ్చి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 
చిన్నగాలివానకే చీకట్లు... 
ఎండాకాలంలో వీస్తున్న చిన్న గాలివానలకే విద్యుత సరఫరా గంటల కొద్ది నిలిచిపోతే రానున్న వర్షాకాలంలో నగరంలో ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారీవృక్షాలు ఉన్న ప్రాంతాల్లో అండర్‌గ్రౌండ్‌ విద్యుత కేబుల్స్‌ వేయడంతో పాటు, చెట్లు ఉన్న ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన విద్యుతశా ఖ ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదనిస్థానికులు విమర్శిస్తున్నారు. వర్షాకాలన్ని దృష్టిలో పెట్టుకొని అధికారులు యుద్ధ ప్రాతిపదికన సమ స్యలున్న ప్రాంతాల్లో విద్యుత మరమ్మతు పనులు చేపట్టాలని స్థానికు లు డిమాండ్‌ చేస్తున్నారు. భారీవృక్షాలు ఉన్న ప్రాంతాల్లో ఇయర్‌ బంచ డ్‌ కేబుల్స్‌ వేయాలని సీనియర్‌ అధికారులు సూచిస్తున్నారు. 
విద్యుత్ స్తంభాల్లో నాణ్యత ఎంత..? 
నగరంలో పలుప్రాంతాల్లో కొత్తగా వేస్తున్న విద్యుత స్తంభాల్లో నాణ్య త లోపిస్తోందని స్థానికులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్నేళ్లుగా వస్తున్న విద్యుత స్తంభాల్లో నాణ్యత లోపిస్తోందని దీనిపై ఉన్నతాధికా రులు కూడా పెద్దగా శ్రద్ద పెట్టడం లేదని విమర్శలున్నాయి. విద్యుతస్తం భాల లోపల తప్పనిసరిగా ఇనుపరాడ్స్‌, కంకరతో కలిపి ఉండాలి. అయి తే ఈ మధ్యకాలంలో వస్తున్న కొన్ని స్తంభాల్లో ఇనుపరాడ్స్‌ కనిపిం చడం లేదని, అందుకే గాలివానలకు పెద్దసంఖ్యలో విద్యుత స్తంభాలు విరిగిపోతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. 
15 బృందాలు, 4 క్రేన్లతో పనులు..
ఒకే ప్రాంతంలో 50 స్తంభాలు పూర్తిగా విరిగిపోవడంతో పాటు 4 ట్రాన్స్‌ఫార్మర్లపై చెట్లు విరిగిపడటంతో వాటి స్థానంలో మొత్తం కొత్తవి ఏర్పాటు చేశాం. 15 సీబీడీ బృందాలతో పూర్తిస్థాయిలో కొత్త లైన్లు వే శాం. ట్రాన్స్‌ఫార్మర్లపై చెట్లు విరిగిపడటంతో విద్యుతతీగలు పూర్తిగా తెగిపోయాయి. 36 గంటల పాటు 20 సీనియర్‌ ఇంజనీర్స్‌, 150 మంది విద్యుత సిబ్బందితో సోమవారం సాయంత్రానికి విద్యుత మరమ్మతు పనులు పూర్తిచేశాం. భారీవృక్షాలు ట్రాన్స్‌ఫార్మర్లు, స్తంభాలపై కూలడం తో వాటిని పూర్తిగా తొలగించి విరిగిన స్తంభాల స్థానంలో కొత్తవి ఏర్పా టు చేసి పూర్తి స్థాయిలో విద్యుత సరఫరా మెరుగుపర్చాం. 
- పర్వతం, సెంట్రల్‌ సర్కిల్‌ ఎస్‌ఈఈ

No comments:

Post a Comment