తెలంగాణలో కరవు ప్రభావంతో పంటల సాగు తగ్గి కూరగాయల కొరతతో తీవ్ర సంక్షోభం ఏర్పడింది. చిల్లర మార్కెట్‌లో ధరలు పెరిగాయి. ఈ మంటతో సామాన్యులు అల్లాడుతున్నారు. ఏకంగా పచ్చిమిరప కిలో రూ.100కు పైగా చిల్లర మార్కెట్‌లో అమ్ముతున్నారు. రైతుబజార్లలోనే వీటి ధర రూ.83 ఉంది. ఇక్కడ ధర తక్కువున్నా నాణ్యత ఉండటం లేదు. ఎండల తీవ్రత కారణంగా పంటల దిగుబడులు బాగా పడిపోయాయి. వ్యాపారం లేక రైతులు.. కూరగాయలు కొనలేక ప్రజలకు ఇక్కట్లు తప్పడంలేదు.
* ధరలు పెరిగిన కూరగాయల రాకలో అంతరం కనిపిస్తోంది. టమాటాల ధర రెండు నెలల్లోనే రూ.5 నుంచి 50 రూపాయలకు పెరిగింది. 2013 మే నెలలో తెలంగాణ మార్కెట్లకు 28,241 క్వింటాళ్లు వస్తే ఈ ఏడాది ఇదే నెలలో కేవలం 9,286 క్వింటాళ్లే వచ్చాయి.
* బెండకాయలు గత నెలలో 39,506 క్వింటాళ్లొస్తే...ఈ నెల 6,641 క్వింటాళ్లే వచ్చాయి. ఇంత భారీ తగ్గుదల కారణంగా వీటి ధర రెట్టింపైంది.
* ఇక్కడ చుట్టుపక్కల పండే కూరగాయల రాకతో పోలిస్తే దూర ప్రాంతం నుంచి ఏడాది పొడవునా వచ్చేవాటిలోనూ వ్యత్యాసం కనిపిస్తోంది. టమాటాలు కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీల నుంచి తెలంగాణకు వస్తుంటాయి. గత మార్చిలో 17,217 క్వింటాళ్లు రాగా ఈ నెల 9,286 క్వింటాళ్లకు తగ్గాయి. ఉత్తర ప్రదేశ్ నుంచి ఏడాది పొడవునా తెలంగాణకు వచ్చే ఆలుగడ్డలు గత నెలలో 13,563 క్వింటాళొæ్ల®్త ఈ నెల 14,025 క్వింటాళ్లకు పెరిగాయి.
ముందుచూపు లేకనే కొరత తీవ్రం
కూరగాయల పంటల సాగు పెంచి కొరత ఏర్పడకుండా చూడటంలో రాష్ట్ర ప్రభుత్వం ముందు జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఇప్పుడు ప్రజలు అల్లాడుతున్నారు. గత మార్చి నుంచి కూరగాయల రాక క్రమంగా తగ్గుతూ వస్తోంది. గతేడాది జూన్ నుంచి వర్షపాతం బాగా తగ్గి కరవు పరిస్థితులు ఏర్పడ్డాయి. బోర్లు పనిచేస్తున్న రైతులను గ్రామాల వారీగా గుర్తించి వారికి రాయితీపై విత్తనాలు, ఎరువులు ఇచ్చి అప్రమత్తం చేసి కూరగాయ పంటలు సాగు చేయిస్తే ఇప్పుడు మార్కెట్‌లో కొరత ఉండేది కాదు. కానీ రాయితీ విత్తనాలకు కనీసం నిధులు విడుదల చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చూపింది. కనీసం ఖరీఫ్‌లోనైనా పంటలు సాగు చేయించేందుకు విత్తనాల పంపిణీ ఇంతవరకూ ప్రారంభించలేదు. ప్రస్తుత వేసవిలో తెలంగాణలో సాధారణంగా 50 వేల ఎకరాల్లో కూరగాయల పంటలుండాలి. కానీ 25 వేల ఎకరాల్లో కూడా లేవని ఉద్యానశాఖ వర్గాలు తెలిపాయి. ఈ ఖరీఫ్‌లో 2 లక్షల ఎకరాల్లో వేయాలి. కానీ విత్తనాలే లేక రైతులు ఎదురుచూస్తున్నారు.
300 గ్రాములు తినాలి
|
-జయమ్మ,
మహిళా రైతు
మంగళపల్లి, రంగారెడ్డి జిల్లా |
|
-
రాములు, రైతు
పోల్కంపల్లి, రంగారెడ్డి |
No comments:
Post a Comment