హైదరాబాద్ : ఆటో
పర్మిట్ రద్దును ఉపసంహరించాలని, ఓలా, ఉబర్ చట్ట వ్యతిరేక కార్యకలాపాలను
నిరసిస్తూ ఆదివారం అర్ధరా త్రి నుంచి నగరంలో ఆటోల బంద్‌కు తెలంగాణ ఆ టో
డ్రైవర్స్ జేఏసీ పిలుపునిచ్చింది. ఈ మేరకు శనివారం బషీర్‌బాగ్
ప్రెస్‌క్లబ్‌లో జేఏసీ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా
జేఏసీ కన్వీనర్ మహ్మద్ అమానుల్లాఖాన్, సభ్యులు మహ్మ ద్ దస్తగీర్,
షేక్ రహీం, ఎంఏ సలీమ్, లక్ష్మీనర్సయ్య మీడియాతో మాట్లాడుతూ ఆటోడ్రైవర్ల
సమస్యలను తీర్చడంలో ప్రభుత్వం విఫలమవుతోందన్నారు. ట్రా ఫిక్ పోలీస్
అధికారులతో చర్చలు జరిపినా ఫలితం లేదని తెలిపారు. చట్ట వ్యతిరేక
కార్యకలాపాలకు పా ల్పడుతున్న ఓలా, ఉబర్ సంస్థలపై చర్యలు తీసుకోవాలని
డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్లు నిబంధనలను అతిక్రమిస్తే ఆటోపర్మిట్ రద్దు
నిర్ణయాన్ని వెన క్కి తీసుకోవాలని వారు కోరారు. ఆటోల కంటే తక్కువ కిలోమీటరు
రేట్లు తీసుకుంటున్న డీజిల్ క్యాబ్‌లను నిషేధించాలన్నారు. ఇతర
రాష్ట్రాలతో సమా నంగా ఆటో చార్జీలను పెంచాలని కోరారు. 16న ప్రా రంభమయ్యే ఈ
సమ్మె తమ సమస్యలు పరిష్కరిం చే వరకు కొనసాగుతుందని తెలిపారు. సభకు ముందు
ఇటీవల మృతి చెందిన జేఏసీ సీనియర్ నా యకుడు జె.రవీందర్ చిత్రపటానికి జేఏసీ
నాయ కులు ఘనంగా నివాళులర్పించారు.

No comments:
Post a Comment