Sunday, 15 May 2016

16న ఏపీ ఐసెట్‌...

  • నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ 
  • ఐసెట్‌ కన్వీనర్‌ రామ్మోహన రావు
ఆంధ్ర విశ్వవిద్యాలయం(విశాఖపట్నం) : ఎంసీఏ, ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ నెల 16న నిర్వహించే ఏపీ ఐసెట్‌కు నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని కన్వీనర్‌ ఆచార్య కె.రామ్మోహనరావు తెలిపారు. ఆంధ్రా యూనివర్సిటీలోని ఐసెట్‌ కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 16వ తేదీ ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు 138 కేంద్రాల్లో పరీక్ష జరుగుతుందని తెలిపారు. విద్యార్థులను ఉదయం 9.30 నుంచి కేంద్రంలోకి అనుమతిస్తామన్నారు. పరీక్ష కేంద్రాల్లోకి కాలిక్యులేటర్లు, మొబైల్‌ఫోన్లు, ఎలకా్ట్రనిక్‌ పరికరాలు అనుమతించబోమన్నారు. విద్యార్థి పేరు, తల్లిదండ్రుల పేర్లు, రిజర్వేషన్‌ కేటగిరి, పుట్టిన తేదీల్లో పొరపాట్లు ఉంటే పరీక్ష కేంద్రంలోని నామినల్‌ రోల్స్‌లో సరిచేసుకోవచ్చని తెలిపారు. పరీక్ష కేంద్రానికి ఒక పాస్‌పోర్టు సైజు ఫొటో తీసుకువెళ్లి నామినల్‌ రోల్స్‌లో అతికించాల్సి ఉంటుందన్నారు. అభ్యర్థులు 8374569978, 0891 2579797 నంబర్లను, convener.apicet2016@gmail.com, office.apicet2016@gmail.comను సంప్రదించాలని తెలిపారు.

No comments:

Post a Comment