సిగరెట్ కొంటే జైలుకే.. సంచలన నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం
వాషింగ్టన్:
దేశవ్యాప్తంగా మైనర్లు సిగరెట్ కొనడం, వారికి అమ్మడాన్ని నిషేధిస్తూ
అమెరికా సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతోపాటు ఆన్‌లైన్ ద్వారా సిగరెట్,
హుక్కా, పొగాకు ఉత్పత్తుల అమ్మకాలను ఆ దేశ ఆహార, మారకద్రవ్యాల శాఖ బ్యాన్
చేసింది. ఇటువంటి వినూత్న నిర్ణయం తీసుకోవడం అమెరికా చరిత్రలో ఇదే ప్రధమం. ఈ
నిర్ణయం మరో మూడు నెలల్లో అమలులోకి రానుంది. దేశ వ్యాప్తంగా పొగాకు
ఉత్పత్తుల వల్ల రోగాల బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ
పెరుగుతుండటంతో ఈ ప్రతిపాదనకు ప్రభుత్వం మొగ్గుచూపింది. వీటి వల్ల మైనర్లు
ఎక్కువగా నేరాలకు పాల్పడటాన్ని గమనించిన మీదట.. వారే మెయిన్ టార్గెట్‌గా
కీలక అడుగులు వేసింది. దీంతో మైనర్లు నేరుగాకానీ, ఆన్‌లైన్ ద్వారా గానీ
సిగరెట్ వంటి పొగాకు ఉత్పత్తులను కొంటే శిక్ష తప్పదని ప్రభుత్వం
హెచ్చరించింది. సిగరెట్ వల్ల కలిగే రోగాల బారిన పడి ప్రతీ యేటా అమెరికాలో 4
లక్షల 80 వేల మంది చనిపోతున్నారు. ప్రతీ అయిదుగురు అమెరికన్లలో ఒకరికి
సిగరెట్ తాగే అలవాటు ఉందని ఓ సర్వేలో తేలింది.
No comments:
Post a Comment