వెల్లడించిన
సురేశ్ ప్రభు
దిల్లీ:
దేశవ్యాప్తంగా 400 రైల్వే స్టేషన్లలో
వచ్చే ఏడాదికి వైఫై సదుపాయం
ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నట్లు
కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్
ప్రభు వెల్లడించారు. వైఫై ద్వారా
ఇంటర్నెట్ చాలా ఎక్కువ వేగంతో
ఇస్తామని ప్రకటించారు. 400 స్టేషన్లలో
వైఫై అందించడానికి గూగుల్‌తో
అనుసంధానమైనట్లు చెప్పారు.
ముంబయి సెంట్రల్ స్టేషన్
నుంచి ఈ సదుపాయాన్ని ప్రారంభించినట్లు
పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు
వచ్చే ఏడాదికి పూర్తవుతుందన్నారు.
పబ్లిక్ వైఫైలలో ప్రపంచంలోనే
వేగంగా ఇంటర్నెట్ అందిస్తున్నట్లు
విశాఖపట్నం, భువనేశ్వర్ రైల్వే
స్టేషన్లలో నిరూపణ అయిందన్నారు.
వైఫై సదుపాయం కోసం రైల్వే గూగుల్‌తో పాటు ఇతర ఆపరేటర్ల సహాయం కూడా తీసుకుంటోందని సురేశ్ ప్రభు అన్నారు. ఛత్రపతి శివాజీ రైల్వే స్టేషన్‌లో టెర్మినల్ అభివృద్ధి గురించి.. చర్చిగేట్ నుంచి శివాజీ టెర్మినల్‌కు కనెక్టివిటీ గురించి ఏప్రిల్ 21న మహారాష్ట్ర ముఖ్యమంత్రితో సమావేశమైనప్పుడు చర్చించామన్నారు.

No comments:
Post a Comment