చాలామంది
స్మార్ట్‌ఫోన్ వినియోగదారులను
ఇబ్బంది పెట్టే సమస్యల్లో బ్యాటరీ
ఛార్జింగ్.. మెమొరీ స్టోరేజ్
సామర్థ్యం చెప్పుకోదగినవి.
పండగలు.. ఫంక్షన్లు ఉన్న సమయంలో
ఫోన్ మెమొరీని వీడియోలు.. ఫొటోలతో
నింపేస్తూ.. మెమొరీ సరిపోలేదని
బాధపడుతుంటాం. అయితే.. తాము రూపొందించిన
మెమొరీ కార్డుతో హెచ్‌డీ క్లారిటీతో
నిరంతరాయంగా 30 గంటలు వీడియోలు
తీసినా అయిపోదని చెబుతోంది
సామ్‌సంగ్.
ఇందుకోసం వీ-నాన్డ్(వి-ఎన్‌ఏఎన్‌డీ) పరిజ్ఞానాన్ని ఉపయోగించి 256 గిగాబైట్ల సామర్థ్యంతో కూడుకున్న సరికొత్త మెమొరీకార్డుని రూపొందించింది. సెకనుకు 95ఎంబీల డేటాను చదవగలిగే ఈ సరికొత్త మెమొరీ కార్డు మార్కెట్‌లోకి విడుదల కావటం ఇదే తొలిసారి అని చెబుతున్నారు. అంతేకాదు.. ఈ మెమొరీకార్డుతో 4000 రిజల్యూషన్ వీడియోలు నిరంతరాయంగా 12 గంటలపాటు.. ఫుల్ హెడీ వీడియోలను 33 గంటలపాటు.. 23 వేలకు పైగా ఎంపీ3 పాటలను నిక్షిప్తం చేసుకోచ్చని సంస్థ ప్రకటించింది.
త్వరలోనే ఆన్‌లైన్ మార్కెట్‌లోకి ఈ స్మార్ట్ మెమొరీకార్డుని 50 దేశాల్లో అందుబాటులోకి తేనున్న సామ్‌సంగ్.. 10 ఏళ్ల వారెంటీ సదుపాయాన్ని కల్పిస్తోంది.

No comments:
Post a Comment