ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో
సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ చెలరేగి ఆడుతున్నాడు.
తాను కొట్టిన బంతిని దూరంగా ఉండి ఫీల్డింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్
బెంగళూరు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ పట్టుకున్నాడు. ఆ వెంటనే బంతిని
బలంగా విసిరాడు. అయితే అది అనుకోకుండా వార్నర్‌కు కొంచెం ఎత్తులో పోయింది.
అయితే ఆ బంతి తనకు తగులుతుందేమో అని వార్నర్ పూర్తిగా కిందకు వంగిపోయాడు. ఆ
తర్వాత పడిపోయాడు. కోహ్లీ అకస్మాత్తుగా తనపైకి బంతి విసరడంతో తనకు
తగులుతుందేమో అని వార్నర్ భయపడ్డాడు. ఆ తర్వాత వెంటనే కోలుకున్నాడు. అంతగా
భయపడిపోయావేంటన్నట్లుగా కోహ్లీ సారీ చెబుతున్నట్లుగా చేయి చూపించాడు. ఆ
తర్వాత చిన్న చిరునవ్వు నవ్వాడు. దీంతో వార్నర్ కూడా నవ్వేశాడు.

No comments:
Post a Comment