మనం
ఎంత కాలం బతకాలి, ఎంత ఆరోగ్యంగా బతకాలి అనేది మనం తీసుకునే ఆహారం మీదే
ఆధారపడి ఉంటుంది. భోజన ప్రియుడు అంటే ఎక్కువ ఆహారం తినే వాడని కాదు..
ఆరోగ్యకరమైన ఆహారం తినేవాడని. అయితే ప్రస్తుతం మారుతున్న పరిస్థితుల
నేపథ్యంలో కొన్ని ఆనారోగ్యకరమైన ఆహార పదార్థాలు ప్రాధాన్యాన్ని
సంతరించుకున్నాయి. అందులో కొన్నింటి గురించి తెలుసుకుందాం.
పాప్‌కార్న్
సాధారణంగా
సినిమా హాళ్లలోనో, షాపింగ్ మాల్స్‌లోనో దొరికే ఈ పాప్‌కార్న్‌ను
తినేందుకు ఆందరూ ఆసక్తి చూపుతారు. అసలు ఇందులో కొవ్వు ఉండదని, ఆరోగ్యానికి
ఇది మంచిదని అందరూ అనుకుంటారు. నిజానికి పాప్‌కార్న్ మంచిదే. కానీ, అది
బాగా పొంగడానికి, రుచిగా ఉండడానికి అందులో కలిపే రసాయనాల వల్లే చిక్కంతా.
మైక్రోవేవ్ ఒవెన్‌లో పాప్‌కార్న్‌ను వేపేటపుడు కలిపే కెమికల్స్ శరీరానికి
విషపూరితమట. అందుకే సాధ్యమైనంత వరకు పాప్‌కార్న్‌కు దూరంగా ఉండాలట.
చాక్లెట్స్
నిజానికి
డార్క్ చాక్లెట్ వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. అయితే అందరూ తినే సాధారణ
చాక్లెట్ల వల్ల ఉపయోగమేమీ ఉండకపోగా, అవి శరీరానికి హాని కలిగిస్తాయట.
మార్కెట్లో దొరికే చాలా చాక్లెట్లను కోకా సాలిడ్స్‌తో తయారు చేయరట. రుచి
కోసం వాటిలో విపరీతమై సుగర్స్, హానికరమైన ఫ్లేవర్స్ కలుపుతారట.
వైట్ బ్రెడ్, రైస్, పాస్తా
మన
దేశంలో పండించే వరి వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. అయితే చూడడానికి బాగుండడం
కోసం వాటిని మిల్లుల్లో విపరీతంగా పాలిష్ చేస్తున్నారు. ఆ క్రమంలో అవి
విటమిన్లను కోల్పోయి కేవలం కార్బోహైడ్రేట్స్‌గా మారుతున్నాయి. వీటిని తిన్న
వెంటనే రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతం పెరిగిపోతాయి. అలాగే ఇవి హై
గ్లెసిమిక్ ఇండెక్స్ ఉన్న ఆహార పదార్ధాలు. వీటి స్థానంలో బ్రౌన్
బ్రెడ్, బ్రౌన్ రైస్ తీసుకోవడం ఉత్తమం.
కూల్ డ్రింక్స్
ఒక
చిన్న క్యాన్‌తో తీసుకునే కూల్ డ్రింక్‌లో దాదాపు ఏడు టీ స్పూన్లకు
సమానమైన చక్కెర ఉంటుందట. అలాగే రుచి కోసం కలిపే యాడెడ్ సుగర్స్ అదనం.
వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల బరువు పెరగడమే కాకుండా భవిష్యత్తులో
మధుమేహం వచ్చే ముప్పు కూడా ఉంది.

No comments:
Post a Comment