Saturday, 14 May 2016

ఉత్తరాఖండ్‌లో తెలుగువారు క్షేమం

న్యూ ఢిల్లీ: కేదర్ నాథ్ యాత్రకు వెళ్లి ఉత్తరాఖండ్‌లో చిక్కుకున్న 63మంది తెలుగువారు క్షేమంగా ఉన్నట్లు ఢిల్లీలోని ఏపీ ప్రభుత్వ కార్యాలయం తెలిపింది. కొండచరియలు విరిగిపడటంతో రోడ్లు మూసివేశారు. దీంతో యాత్రికులను హెలికాఫ్టర్‌లో తరలిస్తున్నట్లు ఉత్తరాఖాండ్ అధికారులు ఏపీ ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారు. ఆరు హెలికాఫ్టర్లే అందుబాటులో ఉన్నందున తరలింపు ప్రక్రియ ఆలస్యమవుతోంది. ఢిల్లీలోని ఏపీ అధికార ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్ రావు ఉత్తరాఖండ్ అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. తెలుగువారికి తొలిప్రాధాన్యత ఇచ్చి హెలికాఫ్టర్ల ద్వారా త్వరగా తరలించాలని ఉత్తరాఖండ్ అధికారులను కోరారు.

No comments:

Post a Comment