Saturday, 28 May 2016

తెలుగు రాష్ట్రాల్లో విషాదాన్ని మిగిల్చిన అకాల వర్షాలు

తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ గాలి దుమారం, భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. అకాల వర్షాలు తెలంగాణలో విషాదాన్ని మిగిల్చాయి. ఈదురుగాలులతో కూడిన వర్షానికి నల్గొండ జిల్లా పెదవూర మండలం ఈదెల గూడెంలో రోకుల షెడ్డు కూలి ఎనిమిదేళ్ల బాలుడు మృతి చెందాడు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించారు.
 
ఇక ఖమ్మం జిల్లా విషయానికొస్తే.. వైరా రిజర్వాయర్‌‌లో ముగ్గురు జాలర్లు గల్లంతయ్యారు. ఖమ్మం-వైరా మధ్య పెద్ద పెద్ద చెట్టు కూలిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నల్గొండ జిల్లా పెద్దదేవుల పల్లిలో విషాదం చోటు చేసుకుంది. ఈదురుగాలులకు చెరువులో పుట్టి బోల్తాపడి ముగ్గురు జాలర్లు మునిగిపోయారు. ఒకరు మరణించగా..ఇద్దరు గల్లంతయ్యారు.
 
ఆంధ్రప్రదేశ్‌‌లోనూ ఇదే పరిస్థితి..విజయనగరం జిల్లా పార్వతీపురం, కొమరాడ పలు ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి.రోడ్లు, ఇళ్లపై చెట్లు విరిగిపడటంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. చిత్తూరు జిల్లాలోని పలుప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తోంది. చంద్రగిరి మండలంలో ఈదురుగాలులు, వర్షం పడుతోంది. పలు చోట్ల రోడ్డుగా అడ్గంగా చెట్లు విరిగిపడ్డాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

No comments:

Post a Comment