Monday, 9 May 2016

       అరటిపండు . ఇది ఒక పేదవాడి ఆపిల్ అని చెప్పుకోవచ్చు. రేటు తక్కువ , పోషక విలువలు ఎక్కువ. ఈ పండు తినడం వలన తక్షణం శక్తి వస్తుంది. అన్ని కాలాలలో లభిస్తుంది. దీనిని మన జీవన విధానంలో చేర్చడం ద్వారా జీవక్రియలకు కావాల్సిన ఆంటి యాక్సిడెంట్స్, విటమిన్స్,మినరల్స్ పొందవచ్చు. 100 గ్రాముల అరటి పండులో... 90కాలరీల శక్తి, 10 గ్రాముల ఫైబర్, 12 గ్రాముల షుగర్ ఉంటాయి. జీవక్రియలకు ఉపయోగపడే పోషకాలు దీనిలో మెండుగా ఉంటాయి. అరటి పిల్లల ఎదుగుదలకు చక్కగా ఉపయోగపడుతుంది. దీనిలో విటమిన్ ఎ,బి, సిలు అత్యధికంగా ఉంటాయి. ఇందులో శరీరానికి హాని చేసే కొవ్వు ఉండదు.. పైగా అరటి నుంచి కావాల్సినంత కాల్షియం, ఐరన్ లభిస్తుంది. రక్త పోటును తగ్గించడంలో, గుండె పనితీరును మెరుగు చేయడంలో ఉపయోగపడే మూలకాలలో ఒకటైన పొటాషియం ఈ అరటి పండులో అత్యధికంగా ఉంటుంది.
అరటి పండును తినడం వలన మన శరీరానికి క్రింది లాభాలు                 ***********************************************************
1. పొటాషియం: పొటాషియం అధికంగా లబించే వనరులలో అరటిపండును ప్రముఖంగా చెప్పవచ్చు. దీని వలన గుండె పని తీరు సక్రమంగా జరుగు తుంది. రక్త పోటును అదుపులో ఉంచుతుంది. అంటే కాకుండా దీని వలన కిడ్నీలు ఆరోగ్యం గా ఉంది కిడ్నీ లలో రాళ్ళు రాకుండా కాపాడుతుంది.
2. అధిక శక్తి: అరటి పండును తినటం వలన తక్షణం అధిక శక్తి లబిస్తుంది. టెన్నిస్ ప్లేయర్స్, ఇతర క్రీడా కారులు ఆట ఆరంభానికి ముందు గాని, ఆట మధ్యలో గాని అరటి పండును తింటున్న దృశ్యాల్ని కొన్ని సందర్భాలలో మనం గమనించ వచ్చు. 
౩. జీర్ణ క్రియను మెరుగు పరుస్తుంది: రోజు వారి ఆహారం లో అరటి పండును తీసుకున్నచో జీర్ణ వ్యవస్థ సాఫీగా పని చేయును. పొట్టలో ఆల్సర్ వచ్చే అవకాశం ను తగ్గిస్తుంది. జీర్ణాశయం లో ఒక ప్రత్యేక మైన పొరను పెంపొందింప చేయుటకు అరటి తోడ్పడుతుంది..
4, బి 6 విటమిన్ అధికం: అరటిలో బి విటమిన్ కూడా అధికంగా ఉంటుంది . ఇది హిమోగ్లోబిన్ ఉత్పత్తి చేయుటలో తోడ్పడుతుంది. రక్తంలో చక్కర నిల్వల స్థాయి నిర్వహణలో ఉపయోగ పడును. వ్యాది నిరోధక శక్తి పెరిగేట్లు చేయును.
5, విటమిన్లు & ఖనిజాలు: .అరటిలో పొటాషియం తో అంతే కాకుండా విటమిన్ సి, మాంగనీస్ మరియు మెగ్నీషియం లు అధిక పాళ్ళలో ఉంటాయి. కొంత మొత్తం లో ఐరన్ , అయోడిన్, జింక్ లు కూడా ఉంటాయి.
6. చర్మ సంరక్షణ: అరటి పండుతో పాటుగా తొక్క కూడా చర్మ సంరక్షణకు ఎంతో ఉపయోగ పడును. ముఖ్యంగా మంగు, సోరయాసిస్ వ్యాదుల తగ్గించుటకు పై పూతగా వాడవచ్చు. కొద్దిరోజులు నిత్యము వాడిన సోరయాసిస్ తగ్గు ముఖం పట్టే విషయంను మనం గమనించవచ్చును.
7. క్యాన్సర్ పై యుద్ధం: అరటి పండు క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. ఆ మధ్య కాలంలో జంతువులపై జరిపిన పరీక్షలలో ఈ విషయం జపాన్ లో నిరూపిoచబడినది.
8. ఒత్తిడిని పోగొడుతుంది: ఒత్తిడిలో ఉన్నప్పుడు అరటిని తీసుకుంటే ఒత్తిడి మటుమాయం అవుతుంది. ఒత్తిడి ఉన్నటువంటి సమయాలలో దీన్ని మించిన అల్పాహారం లేదు.
( చక్కర వ్యాది గ్రస్తులు " మధుమేహం " ఈ అరటిపండు తినరాదు అని డాక్టర్లు సలహా యివ్వటం జరిగింది )

No comments:

Post a Comment