వాషింగ్టన్:
రెండో ప్రపంచ యుద్ధ సందర్భంగా శత్రు సైనికులు కూల్చేయడంతో సముద్రంలో
కూలిపోయిన అమెరికా ఫైటర్ ప్లేన్ ఇన్నేళ్ల తర్వాత బయటపడింది. ఇలా యుద్ధం,
వివిధ సందర్భాల్లో కూలిపోయిన విమానాల ఆచూకీ కనిపెట్టేందుకు అమెరికా
‘ప్రాజెక్ట్ రికవరీ’ అనే ఆపరేషన్ చేపట్టిన విషయం తెలిసిందే. అత్యాధునిక
సోనార్ టెక్నాలజీ సహాయంతో ఇలా సముద్రం అడుగున ఉండిపోయిన విమాన శకాలాల
ఆచూకీని కనుగొంటారు.
1944వ
సంవత్సరంలో జరిగిన రెండో ప్రపంచ యుద్ధ సందర్భంగా అమెరికాకు చెందిన
టీబీఎం-1సి అనే ఫైటర్ బాంబర్ శత్రు స్థావరాలపై దాడి చేయడానికి
బయల్దేరింది. అయితే దాని ఆచూకీ కనిపెట్టిన శత్రు సైనికులు దానిని పసిఫిక్
మహాసముద్రంలో కూల్చేశారు. ఆ ఘటన జరిగి ఇప్పటికి 72 ఏళ్లు పూర్తయ్యాయి.
ఎన్నో ఏళ్లుగా ఆ విమానం కోసం గాలిస్తున్న శాస్త్రవేత్తలు ఎట్టకేలకు విజయం
సాధించారు. ఆ విమానంలో అప్పుడు ముగ్గురు సైనికులు ప్రయాణించారు. వారి
అవశేషాలు కూడా ఇప్పుడు లభ్యమయ్యాయి. ఆ సైనికుల శరీర భాగాలను తీసుకువచ్చి
వాటికి సగౌరవంగా అంత్యక్రియలు జరిపించాలన్నది అమెరికా ప్రభుత్వ ఉద్దేశం.

No comments:
Post a Comment