Sunday, 29 May 2016

కోహ్లీ బౌల్డ్..వరల్డ్ రికార్డ్ మిస్..

బెంగళూరు: ఐపిఎల్ ఫైనల్ మ్యాచ్‌లో కోహ్లీ 54 పరుగుల వద్ద ఔటయ్యాడు. బరిందర్ బౌలింగ్‌లో బైల్డ్ అయ్యాడు. 35 బంతులు ఎదుర్కొని 5 ఫోర్లు, 2 సిక్స్‌లు బాదాడు. అయితే ఈ క్రమంలో అద్భుతమైన రికార్డు మిస్ అయ్యాడు కెప్టెన్ కోహ్లీ. ఒకే టీ20 టోర్నమెంట్‌లో ఇంతవరకూ ఎవరూ చేయలేని 1000 పరుగులు రికార్డుకు 27 పరుగుల దూరంలో వదిలేశాడు. మొత్తం 973 పరుగలతో అద్బుతమైన బ్యాటింగ్ ప్రదర్శన చేసిన కోహ్లీ రియల్లీ మ్యాన్ ఆఫ్ ద సిరీస్.

కోహ్లీ అర్ధశాతకాల వరల్డ్ రికార్డు..

      ఐపిఎల్ ఫైనల్ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసిన కోహ్లీ అదే క్రమంలో అర్ధశతకాల రికార్డును నమోదు చేశాడు. ఈ ఐపిఎల్‌లో మొత్తం 28 మ్యాచ్‌లాడిన కోహ్లీ 18 హాఫ్ సెంచరీలు చేశాడు. ఒకే ఏడిదిలో అత్యధిక అర్ధశతకాలు చేసిన ఆటగాడిగా అవతరించాడు. అది కూడా ఒకే టోర్నమెంట్‌లో సాధించాడు. కోహ్లీ తర్వాత 2012లో క్రిస్ గేల్ 16 అర్ధశతకాలు చేసి రెండో స్థానంలో ఉన్నాడు. అయితే గేల్ 38 ఇన్నింగ్స్‌లలో వాటిని సాధించాడు.

No comments:

Post a Comment