Friday, 6 May 2016

మీకు ఇంట్లో సిగరెట్ కాల్చే అలవాటుందా ?


సర్వేలో మీ గురించి భయంకర నిజం వెలుగు చూసింది !
ఇంట్లో సిగరెట్ కాల్చే తండ్రి... పక్కనే ఓ పాప... టీవీలో టొబాకో యాడ్... సినిమా థియేటర్‌కు వెళ్లగానే కామన్‌గా కనిపించే యాడ్. ఆ పాప కోసం తండ్రి సిగరెట్ మానేస్తాడు. మీకూ అలాంటి అలవాటుంటే మానేయండి. లేకపోతే ప్రమాదం పొంచి ఉందంటున్నారు శాస్త్రవేత్తలు. పొగ తాగే వారి పక్కన ఉండే పిల్లలు చిన్నతనంలోనే అనేక శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్నారని అస్లే మెరియానస్ యూనివర్సిటీ పరిశోధకులు తేల్చారు. ఈ సర్వేలో 2011-12 సంవత్సరానికి సంబంధించిన చిన్నారుల డేటాను తీసుకుని పరిశీలించారు. ఈ పరిశీలనలో దాదాపు 24 శాతం మంది చిన్నారులు పొగ తాగే వారితో కలిసి జీవిస్తున్నారట. వారిలో దాదాపు 15 శాతం మంది చిన్నారులు శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్నారని తేలింది. అందువల్ల పొగ తాగే అలవాటుంటే వెంటనే మానుకోవాలని... లేకపోతే మీ ఇంట్లో ఉండే చిన్నారులకు మీరే రోగాన్ని కొనితెచ్చినట్టవుతుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

No comments:

Post a Comment