Saturday, 28 May 2016

‘కబాలి’ మరో రికార్డు!

హైదరాబాద్‌: సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ కథానాయకుడిగా నటించిన ‘కబాలి’ చిత్రం మరో రికార్డును సొంతం చేసుకుంది. ఏప్రిల్‌ 30న విడుదలైన ఈ చిత్ర తమిళ టీజర్‌ ‘బాహుబలి’ ట్రైలర్‌ను బీట్‌ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా 2 కోట్ల వ్యూస్‌తో సరికొత్త రికార్డును సృష్టించింది. ఈ సందర్భంగా చిత్ర బృందం సోషల్‌మీడియా ద్వారా ఆనందం వ్యక్తం చేసింది. ఇంత వరకు మన దేశంలో ఏ చిత్రానికి దక్కని ఘనత ‘కబాలి’కి దక్కడం గర్వంగా ఉందని పేర్కొంది.
పా రంజిత్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కలైపులి ఎస్‌ థను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రజినీకాంత్‌ భార్యగా రాధికా ఆప్టే నటించారు. చెన్నైకి చెందిన డాన్‌ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సంతోష్‌ నారాయణన్‌ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. జులై 1న ‘కబాలి’ ప్రేక్షకుల ముందుకు రానుంది.

No comments:

Post a Comment