మీ స్మార్ట్‌ఫోన్
ఛార్జర్ పోయిందనో.. పనిచేయటం
లేదనో మార్కెట్‌లో తక్కువ ధరకు
దొరికే ఛార్జర్లను కొంటున్నారా..?
అయితే తస్మాత్ జాగ్రత్త. బయట
దొరికే థర్డ్‌పార్టీ సంస్థల
ఛార్జర్లతో హ్యాకర్ల బారిన
పడే ప్రమాదముందట. ఇది ఎవరో చెప్పింది
కాదు... అమెరికాలోని ఎఫ్‌బీఐ
సైబర్ విభాగం నిపుణులు తాజాగా
విడుదల చేసిన హెచ్చరిక.
యూఎస్‌బీ ఛార్జర్లలో వాడే ఎలక్ట్రానిక్ సర్క్యూట్లలో హాకర్లు ప్రమాదకరమైన ప్రోగ్రాంలను పొందుపరిచే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇక ఆ ఛార్జర్‌ను కేబుల్‌తో కనెక్ట్ చేయగానే ఆ ప్రోగ్రాం ఫోన్‌లో ఇన్‌స్టాల్ అయిపోతుందట. లేకుంటే ఇన్‌స్టాల్ కాకుండానే రన్ అవుతూ ఫోన్‌లోని విలువైన సమాచారాన్ని హ్యాకర్లకు చేరవేస్తుందని అంటున్నారు.
యూఎస్‌బీ ఛార్జర్లలో వాడే ‘ఆర్‌డ్యూయినో’ లాంటి చిప్‌లలో సైబర్ నేరగాళ్లు మాల్‌వేర్‌ను ఉంచే అవకాశం ఎక్కువని ఎఫ్‌బీఐ నిపుణులు వెల్లడించారు. వినియోగదారుడు కీబోర్డుపై టైప్ చేసే అక్షరాలను ఆ మాల్‌వేర్ విశ్లేషించి యూజర్ ఐడీలు.. పాస్‌వర్డ్‌లను తస్కరించి సైబర్ నేరగాళ్లకు చేరవేసే ప్రమాదముందని చెబుతున్నారు.
ఆ ఛార్జర్లను వాడినా ఫోన్‌లో యూఎస్‌బీ డిబగ్గింగ్ ఆప్షన్‌ను డిసేబుల్ చేసుకుంటే కాస్త మేలని సూచిస్తున్నారు. అయినా.. హ్యాకర్లు ఆ ఆప్షన్‌ను కూడా ఎనేబుల్ చేసే అవకాశముందని హెచ్చరిస్తున్నారు. సో.. స్మార్ట్‌ఫోన్ ఛార్జర్ల విషయంలో త‘స్మార్ట్’ జాగ్రత్త.

No comments:
Post a Comment