వాటిని వాడడంలో పురుషుల కంటే స్త్రీలే ముందున్నారట!
లండన్:
ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా వేదికల్లో పురుషులతో సామానంగా
మహిళలూ అసభ్య, అశ్లీల పదాలను వాడేస్తున్నారట. కొన్ని రకాల బూతు పదాలను
వాడడంలో పురుషుల కంటే స్త్రీలే ముందున్నారని ఇటీవల జరిగిన ఓ సర్వే
బయటపెట్టింది. బ్రిటన్‌కు చెందిన డెమోస్ గత మూడు వారాలుగా బ్రిటన్‌లోని
యూజర్లు ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తున్న కామెంట్లను విశ్లేషించింది.
మహిళలను
కించపరిచే అసభ్య పదాలను వాడడంలో పురుషులతోపాటు సాటి స్త్రీలు కూడా
ముందున్నారట. అలాగే సాటి మహిళలపై సెక్సీయెస్ట్ కామెంట్స్ చేయడానికి కూడా
వారు వెనకాడడం లేదట. గత మూడు వారాలుగా ప్రపంచ వ్యాప్తంగా ట్వీట్ అవుతున్న
వాటిల్లో సగటున రెండు లక్షల ట్వీట్లలో స్త్రీలను దూషించే పదాలు ఉన్నాయట.
అవి వెంటనే దాదాపు ఎనభై వేల మందికి చేరుతున్నాయట.

No comments:
Post a Comment