ఆమె చెప్పిన రహస్యం తెలిస్తే మీరూ ఎక్కువ రోజులు బతకొచ్చు..!
ఆ బామ్మ 111 ఏళ్లు బతికింది... ఆమె చెప్పిన రహస్యం తెలిస్తే మనం బతకొచ్చు
ఆమె వయసు 111 సంవత్సరాలు.
ఇంతవరకూ ఎలాంటి నొప్పులు లేవు. బాధలు లేవు. డాక్టర్ల సూదులు లేవు.
శరీరానికి చిన్న గాయమైనా కాలేదు. ఆమె ఆరోగ్య రహస్యాన్ని 120 మంది మనుమళ్లకు
చెప్పింది. ఆహారాన్ని మితంగా తీసుకోవడమే తన జీవన రహస్యమని వారికి
చెప్పింది. అంతేకాదు, వీలైనంత ఎక్కువ సేపు నవ్వడమే తాను ఇన్ని రోజులు
బతకడానికి కారణమని చెప్పింది. ఎలాంటి బాధలున్నా నవ్వుతూ వాటిని
అధిగమించాలని... కుంగిపోతే ఎక్కువ రోజులు బతకలేమని బామ్మగారు చెబుతోంది.
ఆమె పేరు ఫయికీ. టర్కీలో అత్యంత వయసు కలిగిన బామ్మల్లో ఈమె ఒకరు. ఆమెకు
మొత్తం 8 మంది పిల్లలు. ఆ 8 మందికి పుట్టిన సంతానం. వారికి పుట్టిన
పిల్లలు. మొత్తం మీద ఆ బామ్మగారు 120 మంది మనమలు, మునిమనుమళ్లతో సంతోషంగా
గడిపింది. ఆమె 1904లో పుట్టింది. 1984లో ఆమె భర్త చనిపోయాడు. అప్పటి నుంచి
ఆమె తన కోడలు ఫెరిడే సోకర్ దగ్గరే ఉంటోంది.
No comments:
Post a Comment