బీసీ, ఈబీసీ కల్యాణలక్ష్మి పథకం వెబ్‌సైట్‌ను తెలంగాణ రాష్ట్ర మంత్రి జోగురామన్న
ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కల్యాణలక్ష్మి పథకానికి
రూ.300కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 58,820
కుటుంబాలు లబ్ధి పొందుతాయన్నారు. 18 సంవత్సరాలు పూర్తయిన ఆడబిడ్డలకే
ఈ పథకం అమలవుతోందని, వివాహం కాని బీసీ, ఈబీసీల ఆడబిడ్డలు దరఖాస్తు
చేసుకోవచ్చని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.05లక్షలు, పట్టణ ప్రాంతాల్లో
రూ.2లక్షలకు మించి ఆదాయం ఉన్నవారికి ఈ పథకం వర్తించదని చెప్పారు.
2016 ఏప్రిల్ 1 తర్వాత వివాహమైన వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు
అర్హులని మంత్రి వివరించారు.

No comments:
Post a Comment