మొబైల్ ఫోన్లో ఎక్కువ సమయం మాట్లాడితే..!
తాజా అధ్యయనంలో
వెల్లడి
మెల్‌బోర్న్:
మొబైల్ ఫోన్లో ఎక్కువ సమయం మాట్లాడితే.. మెదడు క్యాన్సర్, మెదడులో
ట్యూమర్లు వస్తాయన్నది అవాస్తవమని.. ఈ సమస్యలకు మొబైల్ ఫోన్
మాట్లాడటానికి సంబంధం ఏమీ లేదని తాజా అధ్యయనం ఒకటి పేర్కొంది. 30
ఏళ్లపాటు వివిధ పరికరాలను వినియోగించినా.. అది మెదడులో ట్యూమర్లకు
దారితీసిన సందర్భం ఒక్కటీ లేదని ఈ అధ్యయనం గుర్తించింది. సిడ్నీ విశ్వవిద్యాలయ
పరిశోధకులు 1982 నుంచి 2012 మధ్య మెదడు క్యాన్సర్‌కు గురైన 19858
మంది పురుషులు, 14,222 మంది మహిళలపై అధ్యయనం చేశారు. 1987
నుంచి 2012 మధ్య మొబైల్ ఫోన్ వాడకాన్నీ పరిశీలించారు. ఇందులో మెదడుక్యాన్సర్లకు
మొబైల్ ఫోన్ కారణం కాదని.. ఫోన్ వాడకం మెదడు క్యాన్సర్ల ముప్పును
పెంచదని గుర్తించారు.
No comments:
Post a Comment