Friday, 13 May 2016

కొత్త ఫోన్ రాబోతోంది... ఒకే ఫోన్‌లో రెండు వాట్సప్ అకౌంట్లు !

వాట్సప్ అకౌంట్ అనేది ఫోన్ నంబర్ పైన ఆధారపడి ఉంటుంది. మీ ఫోన్ డ్యుయల్ సిమ్ మొబైల్ అయినప్పటికీ... మీరు ఒక్క నంబర్‌పై మాత్రమే వాట్సప్ అకౌంట్ ఓపెన్ చేయగలరు. కూల్‌పాడ్ నుంచి వస్తున్న కూల్‌పాడ్ మ్యాక్స్ అనే మోడల్ స్మార్ట్‌ఫోన్‌లో మాత్రం రెండు వాట్సప్ అకౌంట్లు ఒకేసారి వినియోగించుకోవచ్చు. మే 20న ఈ ఫోన్‌ను అందుబాటులోకి తేనున్నట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. చాలామంది పర్సనల్‌కు ఒక ఫోన్‌ను... ప్రొఫెషనల్‌కు మరో ఫోన్‌ను ఉపయోగిస్తుంటారు. ఈ ఇబ్బంది నుంచి యూజర్లను గట్టెక్కించేందుకే కూల్ ప్యాడ్ మ్యాక్స్‌ను తయారుచేసినట్లు వారు చెప్పారు.

No comments:

Post a Comment