ఇండియాస్ బిగ్గెస్ట్
బ్లాక్ బస్టర్‌గా పేరొందిన చిత్రం ‘బాహుబలి’. జక్కన్న చెక్కిన ఈ చిత్రం
విడుదలైన ప్రతిచోటా హిట్ టాక్‌తో సక్సెస్ సాధించి వసూళ్లపరంగానూ రికార్డులు
క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. రీసెంట్‌గా ఈ చిత్రం జాతీయ అవార్డు సైతం
దక్కించుకుంది. భారతదేశంలోనే కాకుండా ఈ సినిమాను పలు ప్రపంచ దేశాల్లో కూడా
విడుదల చేశారు. అన్ని చోట్ల విజయఢంకా మోగించిన ఈ చిత్రాన్ని గత నెల 28న
జర్మనీలో 30 స్ర్కీన్లలో విడుదల చేశారు. అయితే ఈ చిత్రం జర్మనీ
ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ చిత్రాన్ని జర్మనీలోని లీడింగ్
డిస్ట్రిబ్యూషన్ కంపెనీ భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. కానీ తొలివారం
పూర్తయ్యేనాటికి ఈ సినిమా ఇప్పటి వరకు 4,166 యూరోస్ అంటే 3.17 లక్షల
రూపాయలను మాత్రమే వసూళ్లు చేయగలిగింది. కనీసం నాలుగు లక్షల కలెక్షన్లు కూడా
రాబట్టలేకపోయింది. దీంతో జర్మనీ డిస్ట్రిబ్యూటర్ భారీ నష్టాలు
చవిచూడాల్సి వచ్చింది. అన్ని భాషల్లో ఆకట్టుకున్న ‘బాహుబలి’ జర్మన్లకు
మాత్రం ఎందుకు నచ్చలేదేనని కొందరు అనుకుంటున్నారు. బాహుబలి త్వరలోనే లాటిన్
అమెరికా, యూరోపియన్ దేశాల్లోనూ విడుదలకు సిద్ధమవుతోంది.

No comments:
Post a Comment