సౌదీ అరేబియాలో
ఇటీవలి కాలంలో విడాకుల పర్వం ఎక్కువవుతోంది. అయితే వీరు విడాకులు తీసుకోడానికి
గల కారణాలు వింటే మాత్రం అందరూ ఆశ్చర్యపోవాల్సిందే. మొన్నటికి మొన్న
తనను పట్టించుకోకుండా ఫోన్ వినియోగిస్తుందన్న కోపంతో పెళ్లయిన
వెంటనే భార్య నుంచి విడాకులు కోరాడో భర్త. తాజాగా.. భార్య ఖరీదైన ఆపరేషన్
చేయించుకుందని.. ఆమెకు విడాకులిచ్చాడు మరో భర్త.
సౌదీ రాజధాని రియాద్‌కు చెందిన ఓ వ్యక్తి... తన భార్య లావుగా ఉండటంతో బరువు తగ్గమని చెప్పాడు. కొన్ని రోజుల తర్వాత ఆ వ్యక్తి విధుల నిమిత్తం నజ్రాన్ ప్రాంతానికి వెళ్లాడు. అయితే భర్త తిరిగొచ్చే సరికి నాజూగ్గా కన్పించాలని భావించిన ఆ భార్య.. ఓ వైద్యుడి దగ్గరకు వెళ్లి.. బరువు తగ్గేందుకు ఆపరేషన్ చేయించుకుంది. ఇందుకు 80వేల రియాల్స్(భారత కరెన్సీలో దాదాపు రూ.14లక్షలు) ఖర్చుచేసింది.
విధుల నుంచి తిరిగొచ్చిన ఆ వ్యక్తి భార్యను చూడగానే ఆనందం వ్యక్తం చేశాడు. అయితే.. అందుకైన ఖర్చు వివరాలు చెప్పేసరికి ఆగ్రహానికి గురయ్యాడు. ఇంటి కోసం దాచిపెట్టిన డబ్బును ఆపరేషన్ కోసం ఖర్చు చేసిందన్న కోపంతో ఆమెకు విడాకులిచ్చేశాడు.

No comments:
Post a Comment