Wednesday, 11 May 2016

వేణుమాధవ్‌ ఇక లేరంటూ ప్రచారం


    తాను మృతి చెందినట్లుగా వార్త లు ప్రసారం చేసిన ఓ తెలుగు చానల్‌తోపాటు రెండు వెబ్‌సెట్లపై కమెడియన్ వేణుమాధవ్‌ మంగళవారం హైదరాబాద్‌లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘గతకొంతకాలంగా అనారోగ్యానికి గురైన వేణుమాధవ్‌ ఇక మనకు లేడు. నిమ్స్‌లో చివరిగా మాట్లాడిన వేణుమాధవ్‌..’’ అంటూ ఒక చానల్‌ అసత్య ప్రచారం చేసిందన్నారు. అలాగే... రెండు వెబ్‌సైట్లపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘చాలా తక్కువ కాలంలో స్టార్‌ కమెడియన్‌గా ఎదిగిన నటుడు వేణుమాధవ్‌. వరుస సినిమాలతో నవ్వించి ఇప్పుడు సినిమాలకు కాస్త దూరమైనట్లు కనిపిస్తోంది.
  • చానల్‌, వెబ్‌సైట్లపై కమెడియన్‌ ఫిర్యాదు
దీనికి కారణం వేణుమాధవ్‌కు అవకాశాలు లేకపోవడమా.. అనారోగ్యం పాలుకావడమా అనేది ప్రశ్నగా మారింది. సినిమాలు చేస్తున్న సమయంలోనే షుగర్‌, అనారోగ్యం వల్ల సెట్స్‌లో ఎక్కడంటే అక్కడ పడిపోవడంతోనే సినిమా అవకాశాలు తగ్గిపోయాయని టాక్‌ వినిపిస్తోంది. మరి ఇప్పుడు వేణుమాధవ్‌ పరిస్థితి ఎలా ఉందో తెలియదు. కానీ, ఆయనను ఆదుకోవాలి’’ అని వచ్చిన వార్తలతో మనోవేదనకు గురైనట్లు చెప్పారు. తాను తిరుపతికి వెళ్లి స్వామి వారిని దర్శించుకొని చిరంజీవి 150వ సినిమా, బాలయ్యబాబు 100వ సినిమా సూపర్‌ డూపర్‌ హిట్‌ కావాలని మొక్కుకున్నట్లు తెలిపారు. తనపై తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలసి కోరుతానని వేణుమాధవ్‌ చెప్పారు.

No comments:

Post a Comment