Friday, 13 May 2016

శంషాబాద్‌లో అతిపెద్ద కార్గో విమానం

హైదరాబాద్‌: ప్రపంచంలోనే అతి పెద్ద కార్గో విమానం శుక్రవారం ఉదయం శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది. సాధారణ కార్గో విమానాలతో పోల్చితే ఇది చాలా పెద్దది. ప్రపంచంలోకెల్లా పెద్ద విమానంగా దీనికి గిన్నిస్‌ రికార్డు కూడా ఉంది. ఇంకా ఎన్నో ప్రపంచ రికార్డులు దీని సొంతం. ఉక్రెయిన్‌కు చెందిన ఈ విమానం పేరు ఆంటోనవ్‌ ఏఎన్‌-225 మ్రియా.
ఈ విమానానికి ఆరు టర్బో ఫ్యాన్‌ ఇంజన్లు ఉంటాయి. ప్రపంచంలో అత్యంత పొడవైన, బరువైన విమానం ఇదే. ఇది సుమారు 640 టన్నుల బరువును రవాణా చేయగలదు. ఏ విమానానికి లేనంత అతిపెద్ద రెక్కలు దీనికి ఉన్నాయి. తుర్కిమినిస్థాన్‌ నుంచి ఆస్ట్రేలియా వెళ్తుండగా మార్గ మధ్యలో శంషాబాద్‌లో ఆగింది. ఇది 116 టన్నుల బరువైన జనరేటర్‌ను తీసుకెళ్తొంది.

 

No comments:

Post a Comment