రజనీకాంత్, పా.రంజిత్ కాంబినేషన్‌లో తెరకెక్కిన కబాలి చిత్ర రిలీజ్ కోసం
అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ చిత్ర టీజర్
అభిమానుల్లో ఉన్న ఎగ్జైట్‌మెంట్‌ని మరింత పెంచింది. మే 31 న ఆడియో కార్యక్రమాన్ని జరపాలని
నిర్మాతలు భావిస్తున్నారు. ఉదయం చెన్నైలో తమిళ వర్షెన్ ఆడియో
కార్యక్రమాన్ని నిర్వహించనుండగా, అదే రోజు సాయంత్రం తెలుగు వర్షెన్ ఆడియోను
రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు. ఈ విషయంపై నిర్మాతలు త్వరలో ఓ అధికారిక
ప్రకటన చేయనున్నారు. రాథికా ఆప్టే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి
సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు.
రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది...
తమిళ నటుడు రజినీకాంత్ నటిస్తోన్న తాజా మూవీ కబాలి విడుదలపై అభిమానుల్లో
నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. కబాలి సినిమాను జులై 1న విడుదల చేయనున్నట్టు
చిత్ర యూనిట్ వెల్లడించింది. కబాలి ని ముందుగా జూన్‌లోనే రిలీజ్ చేయాలని
భావించినప్పటికీ..కొన్ని కారణాల వలన జులై లో రిలీజ్ చేయాలని నిర్ణయించారు.
పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన కబాలి లో రజినీ డాన్ పాత్రలో కనువిందు
చేయనున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోన్న విషయం
తెలిసిందే. కలైపులి ఎస్ థాను నిర్మిస్తున్న కబాలిలో రాధికాఆప్టే, ధన్సికా,
రిత్విక, తైవానీ నటుడు విన్‌స్టన్ చావో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

No comments:
Post a Comment