Friday, 13 May 2016

ఐసిసి క్రికెట్ కమిటీ చైర్మన్‌గా కుంబ్లే, సభ్యుడిగా ద్రావిడ్

    భారత క్రికెట్ మాజీ కెప్టెన్ అనిల్ ‌కుంబ్లే శుక్రవారంనాడు ఐసిసి క్రెకెట్ కమిటీ చైర్మన్‌గా తిరిగి నియమితులయ్యారు. ఈ పదవికి ఎన్నిక కావడం ఇది రెండోసారి. 2018తో ఆయన పదవీ కాల ముగుస్తుంది. అంటే మూడేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. కాగా, కుంబ్లే ఒకప్పటి టీమ్‌మేట్, బ్యాటింగ్ దిగ్గజం రాహుల్ ద్రావిడ్‌ ఐసిసి క్రికెట్ కమిటీ సభ్యుడుగా నియమితులయ్యారు. అలాగే శ్రీలంక మాజీ క్రికెటర్ మహేలా జయవర్దనే సైతం ఐసిసి క్రికెట్ సభ్యుడిగా నియమితులయ్యారు. వీరు సైతం మూడేళ్ల పాటు తమ పదవుల్లో కొనసాగుతారు. కుంబ్లే, రాహుల్ ద్రావిడ్ ఐసిసికి నియమితులు కావడంపై బిబిసిఐ ఒక ప్రకటనలో హర్షం వక్తం చేసింది. ఐసిసి క్రికెట్ కమిటీలో ఇద్దరు భారత క్రికెట్ దిగ్గజాలకు చోటు కల్పించడం గర్వకారణమని బిసిసిఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ అన్నారు.

No comments:

Post a Comment