Saturday, 7 May 2016

టి.ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులు...

కేవలం ఇంటర్మీడియెట్‌లో ఉత్తీర్ణత
-ఆకర్షణీయమైన జీతభత్యాలు
-18 నుంచి 28 ఏండ్ల మధ్య ఉండాలి
-పురుషులకు, మహిళలకు అవకాశం
-రాత పరీక్ష, పీక్యూటీ, పీఈటీ ద్వారా ఎంపిక


           తెలంగాణ ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్‌లో ఖాళీగా ఉన్న 340 ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి అర్హులైన పురుష, మహిళా అభ్యర్థుల నుంచి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
          వివరాలు: తెలంగాణ ఎక్సైజ్ శాఖ రాష్ట్ర స్థాయిలో మద్యాన్ని, నార్కోటిక్స్, సైకోట్రోపిక్స్, మద్యపానం, మత్తుమందులకు సంబంధించిన చట్టాలను Tspsc Excise Department 340 constable posts టీఎస్‌పీఎస్సీ ఎక్సైజ్‌శాఖలో 340 కానిస్టేబుల్ పోస్టులుపర్యవేక్షిస్తుంది/ అమలు పరుస్తుంది.
పోస్టు పేరు: ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కానిస్టేబుల్

మొత్తం ఖాళీల సంఖ్య - 340
         జనరల్-165 (98G, 67W) బీసీ ఏ-24 (16G, 8W), బీసీ బీ-27 (16G, 8W), బీసీ సీ-7 (4G, 3W), బీసీ డీ-22 (12G, 10W),బీసీ ఇ-15 (10G, 5W), ఎస్సీ-58 (34G, 24W), ఎస్టీ-17 (11G, 6W), ఎక్స్‌సర్వీస్‌మెన్-5 (4G, 1W)
జిల్లాలవారీగా ఖాళీలు : హైదరాబాద్-82, ఆదిలాబాద్-47, కరీంనగర్-41, నల్లగొండ-38, రంగారెడ్డి-31, మహబూబ్‌నగర్-26, వరంగల్-25, మెదక్-25, నిజమాబాద్-25.
అర్హతలు: ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థ/బోర్డు నుంచి ఇంటర్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత.
వయస్సు: 2016, జూలై 1 నాటికి 18 - 28 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఐదేండ్లు, సెన్సెస్ డిపార్ట్‌మెంట్‌లోతాత్కాలిక ఎంప్లాయ్, ఎక్స్ సర్వీస్‌మెన్/ఎన్‌సీసీ ఇన్‌స్ట్రక్టర్‌కు మూడేండ్లు, తెలంగాణ స్టేట్ గర్నమెంట్ ఎంప్లాయ్ (టీఎస్‌ఆర్టీసీ, కార్పొరేషన్స్, మున్సిపాలిటీస్)కు ఐదేండ్లు, వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
శారీరక ప్రమాణాలు:
పురుషులు - కనీసం 165 సెం.మీ.ఎత్తు ఉండాలి, ఛాతీ చుట్టుకొలత: 81 సెం.మీ. తగ్గకుండా, గాలి పీల్చినప్పుడు కనీసం 5 సెం.మీ. వ్యాకోచం చెందాలి (81 సెం.మీ.-85 సెం.మీ.)
మహిళా అభ్యర్థులు - 152.5 సెం.మీ. ఎత్తు ఉండాలి, కనీసం 45.5 కిలోల బరువు కంటే తక్కువ కాకుండా ఉండాలి.
ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు మినహాయింపు ఉంటుంది
బరువు - ఎత్తుకు తగ్గ బరువు ఉండాలి.
కంటిచూపు - 6/6, 6/6
పే స్కేల్: రూ. 15,460-47,330/-
అప్లికేషన్ ఫీజు: రూ. 200/-(ఎస్సీ, ఎస్టీ, బీసీ, మాజీ సైనికోద్యోలకు, 18-28 ఏండ్లు ఉన్న నిరుద్యోగ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు)
పరీక్ష కేంద్రాలు: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జిల్లా ప్రధాన కేంద్రాల్లో ఎగ్జామ్ నిర్వహిస్తారు.
ఎంపిక: ప్రిలిమినరీ క్వాలిఫైయింగ్ టెస్ట్ (పీక్యూటీ), ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (పీఈటీ), రాత పరీక్ష ద్వారా
ప్రిలిమినరీ క్వాలిఫైయింగ్ టెస్ట్ (పీక్యూటీ): 20 నిమిషాల్లో పురుష అభ్యర్థులు 4 కి.మీ, మహిళా అభ్యర్థులు 2 కి.మీ దూరం పరుగు పందెంను పూర్తి చేయాలి.
ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (పీఈటీ)
పురుష అభ్యర్థులు: 100 మీటర్ల పరుగు పందెం-15 సెకండ్లు, హైజంప్-1.20 మీటర్లు, లాంగ్ జంప్-3.80 మీటర్లు, షాట్‌పుట్-7.60 కిలోలు/5.60 మీటర్లు, 800 మీటర్ల పరుగు పందెం-2 నిమిషాల 50 సెకండ్లు పూర్తిచేయాలి
మహిళా అభ్యర్థులు: 100 మీటర్ల పరుగు పందెం-18 సెకండ్లు, లాంగ్ జంప్-2.75 మీటర్లు, షాట్‌పుట్-4 కిలోలు/4.5 మీటర్లు పూర్తిచేయాలి
ఆబ్జెక్టివ్ రాత పరీక్ష/కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్‌మెంట్ టెస్ట్
రాత పరీక్ష 150 మార్కులకు ఉంటుంది. జనరల్‌నాలెడ్జ్ (75 ప్రశ్నలు), సెక్రటేరియల్ ఎబిలిటీస్ (75 ప్రశ్నలు)
రాత పరీక్షలో మొత్తం 150 ప్రశ్నలకు 2 గంటల 30 నిమిషాల సమయాన్ని కేటాయించారు
ఆబ్జెక్టివ్ రాత పరీక్ష తెలుగు /ఇంగ్లిష్ భాషల్లో ఉంటుంది
ఆబ్జెక్టివ్ రాత పరీక్షలో జనరల్ అభ్యర్థులు 40శాతం (150 మార్కులకు 60 సాధించాలి), ఓబీసీ అభ్యర్థులు 35 శాతం (150 మార్కులకు 52.50 సాధించాలి), ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 30 శాతం (150 మార్కులకు 45 సాధించాలి) కనీస మార్కులను సాధించాలి.
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా. అర్హత కలిగిన అభ్యర్థులు టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్ ద్వారా ఓటీఆర్ అప్లికేషన్ ఫామ్ నింపితే, టీఎస్‌పీఎస్సీ ఐడీ జనరేట్ అవుతుంది. దీని సహాయంతో పరీక్ష సెంటర్, ఫీజును చెల్లించాలి.
AbkariPolice


ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ: మే 5
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చివరి తేదీ: మే 30
రాతపరీక్ష తేదీ: త్వరలో ప్రకటిస్తారు
వెబ్‌సైట్: WWW.TSPSC.GOV.IN

No comments:

Post a Comment