Sunday, 15 May 2016

కేంద్ర మంత్రి దత్తాత్రేయ ఇంట్లో చోరీ

హైదరాబాద్‌: కేంద్రమంత్రి దత్తాత్రేయ చరవాణిని గుర్తుతెలియని వ్యక్తులు ఆదివారం దొంగలించారు. దీంతో మంత్రి అడిషనల్‌ పీఏ యుగంధర్‌ ముషీరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాంనగర్‌లోని దత్తాత్రేయ ఇంటిని పరిశీలించారు. సీఐ మోహన్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం ఉదయం 8:30 గంటలకు దత్తాత్రేయ తన నివాసంలోని కింద హాల్‌లో సామ్‌సంగ్‌ జే7 చరవాణిని ఛార్జింగ్‌ పెట్టారు. గంట తర్వాత బయటికి వెళ్లాలని చరవాణిని వెతకగా అది కనిపించలేదు. మంత్రి ఇంట్లోని సీసీ కెమెరాలు గత కొద్దిరోజుల నుంచి పని చేయటం లేదు. దీంతో చోరీ చేసిన వ్యక్తిని గుర్తించటం కష్టతరమైంది. ఉదయం 8 నుంచి 9 మధ్యలో దాదాపు 60 మంది మంత్రిని కలిసేందుకు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులువెల్లడించారు.

No comments:

Post a Comment