ఎవరు ఒప్పుకున్నా,
ఒప్పుకోకపోయినా మనిషికీ, జబ్బులకీ అనుసంధానం అగర్ బత్తీ అనే మాట నిజం
అంటున్నారు నిపు ణులు. సువాసనలు వెదజల్లే అగర్‌బత్తీ పొగలో అనేక రకాల
అనారోగ్యం కలిగించే మూలకాలున్నాయి. ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత కలిగిన
అగర్ బత్తీల తయారీలో పాలీఅరోమేటిక్ హైడ్రో కార్బన్‌లను వాడతారు. ఈ రసాయనం
మండించడం ద్వారా వచ్చే పొగ పీల్చడం వల్ల జలుబు, దగ్గు, ఎలర్జీ, తుమ్ములు,
ఆస్తమా లాంటి సాధారణ అనారోగ్య సమస్యల నుంచి గుండె జబ్బులు, క్యాన్సర్
లాంటి ప్రాణాంతక వ్యాధులకు లోనయ్యే అవకాశం ఉంది. ఈ పొగలోని కార్బన్ డై
ఆక్సైడ్, సల్ఫర్ డై ఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్‌లు ఊపిరితిత్తు లల్లోని
కణాలకు వాపు కలిగిస్తాయి. ఫలితంగా శ్వాస తీసుకోవడం కష్టమవు తుంది. ఈ
రసాయనాల వల్ల చర్మం, కళ్లు తీవ్ర మైన ఎలర్జీలకు లోనవుతాయి. తరచుగా ఈ పొగ
పీల్చడం వలన ప్రాణాంతకమైన గుండె జబ్బులు, క్యాన్సర్ లు వచ్చే అవకాశం
ఎక్కువ. ఆధ్యాత్మిక కార్యకలాపాలే వృత్తిగా జీవించే వారికి, నిత్యం ఇటువంటి
కార్యకలాపాల్లో మునిగి తేలే వారికి ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుందనడంలో సందేహం
లేదు. ఇళ్లలో ఇటువంటి కార్యక్రమాలు జరిపే సమయంలో చాలా కొద్దిసేపు మాత్రమే
లాంఛనంగా అగర్‌బత్తీలు వెలిగించడం మేలంటున్నారు నిపుణులు. పిల్లలను ఈ పొగకు
దూరంగా ఉంచడం చాలా ముఖ్యమని వారు సూచిస్తున్నారు.
No comments:
Post a Comment