Friday, 20 May 2016

బ్ర‌హ్మోత్స‌వం ప్లాప్‌కు కార‌ణాలు...

శ్రీమంతుడు త‌ర్వాత ప్రిన్స్ మ‌హేష్‌బాబు న‌టించిన బ్ర‌హ్మోత్స‌వం సినిమా భారీ అంచ‌నాల మ‌ధ్య ఈ రోజు గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది. గ‌తంలో మ‌హేష్‌కు సీత‌మ్మ‌వాకిట్లో సిరిమ‌ల్లెచెట్టు లాంటి హిట్ మూవీ ఇచ్చిన శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేసిన సినిమా కావ‌డంతో బ్ర‌హ్మోత్స‌వంపై భారీ అంచ‌నాలే ఉన్నాయి. అందుకు త‌గ్గ‌ట్టే బ్ర‌హ్మోత్స‌వం ఏకంగా రూ.90 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. భారీ అంచ‌నాల మ‌ధ్య వ‌చ్చిన ప్రిన్స్ మ‌హేష్‌బాబు బ్ర‌హ్మోత్స‌వం అంచ‌నాల‌కు రీచ్ కాలేక‌పోయింది.
బ్ర‌హ్మోత్స‌వం ప్రేక్ష‌కుల‌ను అనుకున్న స్థాయిలో మెస్మ‌రైజ్ చేయ‌క‌పోవ‌డానికి చాలా కార‌ణాలే క‌నిపిస్తున్నాయి. శ్రీకాంత్ ఎంచుకున్న లైన్ కూడా మ‌రీ పాత‌దీ కావ‌డంత‌…అది కూడా తెర‌మీద‌కు వ‌చ్చేస‌రికి కారం, ఉప్పు లేని ప‌చ్చ‌డిలా మారిపోవ‌డం జ‌రిగాయి. శ్రీకాంత్ అడ్డాల చెప్పిన బ్ర‌హ్మోత్స‌వం క‌థ‌నం పూర్తిగా గాడితప్పింది. అందుకే ఎక్కడా కూడా ప్రేక్షకులు ఇన్వాల్వ్ అవలేరు. కథనంతో ట్రావెల్ అవ్వలేరు.
తెర‌నింగా కావాల్సినంత మంది ఆర్టిస్టులు ఉన్నా.. వాళ్ళకు సరైన క్యారెక్టర్స్ లేవు. మంచి సీన్స్ కూడా లేవు. ఏ ఒక్క సీన్‌ను కూడా శ్రీకాంత్ ప్రేక్ష‌కుల మ‌న‌స్సులో బ‌లంగా ముద్ర‌వేసేలా చెప్ప‌లేక‌పోయాడు. అస‌లు మ‌హేష్ ఎంతో ప్రేమించిన కాజ‌ల్ సినిమా నుంచి స‌డెన్‌గా మాయ‌మ‌వుతుంది. ఆమె క్యారెక్ట‌ర్ క్లోజింగ్‌కు స‌రైన ముగింపు లేదు. సినిమాలో అన్ని ఫీలింగ్స్ మిస్ అయ్యాయి.
ఇక స‌మంత ఎంట్రీ పెద్ద కామెడీ, బిగ్ జోక్‌లా ఉంటుంది. తాను మ‌హేష్ చెల్లి ఫ్రెండ్‌న‌ని చెప్పీ ఎంట్రీ ఇచ్చి మ‌హేష్‌తోనే ఉండిపోతుంది. సందర్భం లేకుండా పాటలు వచ్చిపడుతూ ఉంటాయి. బంధువుల దగ్గరకు వెళ్ళినప్పుడు వచ్చే సీన్స్‌లో ఒక్కటి కూడా ఇంప్రెసివ్‌గా లేవంటే ఇక సినిమాలో ఏం ఇన్వాల్వ్ అవుతాం. చివరలో రావు రమేష్ రియలైజ్ అవడం కూడా పరమ డ్రమెటిక్‌గా ఉంది. ఫైన‌ల్‌గా బ్ర‌హ్మోత్స‌వం …గ్రామోత్స‌వంలా కూడా లేదు.

No comments:

Post a Comment