Thursday, 26 May 2016

                ఇద్దరు ఫస్ట్‌.. 50 మంది సెకండ్‌...

చెన్నై: తమిళనాడులో పదోతరగతిపరీక్ష (ఎస్‌ఎస్‌ఎల్‌సీ) ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి. అయితే ఈసారి ఫలితాల్లో ఎన్నో ఆసక్తికర అంశాలు ఉన్నాయి. స్టేట్‌ ఫస్ట్‌ ర్యాంకును ఇద్దరు విద్యార్థులు పంచుకున్నారు. రాసిపురంలోని ఎస్‌ఆర్వీ ఎక్సెల్‌ మెట్రిక్యులేషన్‌ హయ్యర్‌ సెకండరీ స్కూల్‌కు చెందిన ప్రేమసుధ, విరూధ్‌నగర్‌లోని నోబెల్‌ మెట్రిక్‌ స్కూల్‌కు చెందిన శివకుమార్‌లు తొలి ర్యాంకు సాధించారు. వీరిద్దరూ 500 మార్కులకుగాను 499 మార్కులు సాధించడం విశేషం.
ఇక స్టేట్‌ రెండో ర్యాంకైతే ఏకంగా 50 మందికి వచ్చింది. వీరందరికీ 498 మార్కులు వచ్చాయి. అక్కడితే అయిపోలేదు.. 497 మార్కులతో మూడో ర్యాంకు 224 మందికి వచ్చింది.
ఈ ఏడాది పదోతరగతి పరీక్షల్లో 93.6శాతం ఉత్తీర్ణులవ్వడం మరో విశేషం. మొదటి ర్యాంకు సాధించిన ప్రేమసుధ దిండిగల్‌లోని వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రోత్సాహం వల్లే తాను మొదటి ర్యాంకు సాధించానని ప్రేమసుధ పేర్కొంది. హయ్యర్‌ సెంకడరీలో ఫస్ట్‌ గ్రూప్‌(గణితం, భౌతిక శాస్త్రం, రసాయనశాస్త్రం, జీవశాస్త్రం) తీసుకోనున్నట్లు తెలిపింది. మొదటి ర్యాంకు సాధించిన మరో విద్యార్థి శివకుమార్‌ మాట్లాడుతూ ఏరోజు పాఠాలు ఆరోజు శ్రద్ధగా చదువుకుని అర్థంచేసుకునే వాడినన్నాడు. తాను కామర్స్‌ గ్రూప్‌ తీసుకోనున్నట్లు వెల్లడించాడు.
 

No comments:

Post a Comment